కరోనా: చేతులెత్తేసిన కేంద్రం.. 

Covid Crisis Center Says States Will Decide About Lockdown - Sakshi

లాక్‌డౌన్‌పై స్పష్టతనిచ్చిన కేంద్రం

సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన ఆంక్షలు విధించినా లాభం లేకుండా పోతుంది. మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో ఘోరంగా విఫలం అవుతున్నాయి ప్రభుత్వాలు. దేశంలో కోవిడ్‌ కట్టడికి లాక్‌డౌనే సరైన నిర్ణయం అని సుప్రీంకోర్టుతో సహా పలువురు ప్రముఖులు, సర్వేలు తెలుపుతున్నాయి.

ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్రం కీలక సూచనలు చేసింది. తాము దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించలేమని.. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఇక ఇప్పటికే కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాలు వారం నుంచి రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. 

చదవండి: బాబోయ్‌... 4 లక్షలూ దాటేశాం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top