Covid-19: తొలగని థర్డ్‌ వేవ్‌ ముప్పు! 

Covid 19: Experts Suspect That a Third Wave Could Occur with Delta 4 - Sakshi

డెల్టా మాదిరిగా పురోగమిస్తున్న డెల్టా–4 మ్యూటెంట్‌ 

దేశంలో డెల్టా వేరియెంట్‌లోని 25 మ్యూటేషన్లు గుర్తింపు 

డెల్టా–4తో థర్డ్‌ వేవ్‌ రావొచ్చని నిపుణుల అనుమానం 

80.85 కోట్లకు చేరిన వ్యాక్సిన్‌ డోస్‌ల సంఖ్య

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తిపై ప్రజల్లో భయాందోళనలు పూర్తి తొలగిపోయే పరిస్థితి కనిపించట్లేదు. డెల్టా వేరియంట్‌లో ఇప్పటివరకు 25 మ్యాటేషన్లను నిపుణులు గుర్తించారు. భారత్‌లోనే కాకుండా, అమెరికా, యూరప్‌తో సహా అనేక దేశాలలో ఈ మ్యూటేషన్‌ పరివర్తన కొనసాగుతోంది. దీని కారణంగా వైరస్‌లో మరిన్ని మార్పులు సంభవిస్తాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

భారతదేశంలో డెల్టా–4 అనే కరోనా వేరియంట్‌తో థర్డ్‌ వేవ్‌ ప్రమాదం ఇంకా తొలగిపోలేదని బయో టెక్నాలజీ విభాగం శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాస్తవానికి దేశంలో డెల్టా–4 వేరియంట్‌ వ్యాప్తి పెరుగుతోంది. దీనికి సంబంధించి శాస్త్రవేత్తల బృందం హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సెకండ్‌ వేవ్‌ నుంచి డెల్టా వేరియంట్‌లో మ్యూటేషన్లు జరుగుతూనే ఉన్నాయని , ఈ నెల 13వ తేదీన బయోటెక్నాలజీ విభాగం బృందం కేంద్ర ప్రభుత్వానికి అందించిన ఒక నివేదికలో తెలిపింది.

దేశవ్యాప్తంగా కరోనా వేరియంట్లలో మ్యూటేషన్లను గుర్తించేందుకు ఇప్పటివరకు 90,115 నమూనాల జన్యు శ్రేణి పూర్తయిందని, అందులో 62.9 శాతం నమూనాల్లో వైరస్‌కు సంబంధించిన తీవ్రమైన వేరియంట్స్‌ని గుర్తించామని నివేదికలో పేర్కొన్నారు. వీటిలో డెల్టా, ఆల్ఫా, గామా, బీటా, కప్ప వంటి వేరియంట్‌లు కోవిడ్‌–19కు సంబంధించిన ఇన్‌ఫెక్షన్‌ ప్రమాదాన్ని పెంచడమే కాకుండా, వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా సోకుతాయని గుర్తించారు.

దేశంలో మ్యూటేషన్‌ సి.1.2 అనే వేరియంట్‌ కేసు ఇప్పటివరకు గుర్తించలేదని నివేదిక స్పష్టంగా పేర్కొంది. అయితే కరోనా వైరస్‌కు సంబంధించిన డెల్టా, డెల్టాకు సంబంధం ఉన్న ఇతర మ్యూటేషన్లు నిరంతరం జరుగుతున్నాయని తెలిపారు. దీని కారణంగా మహమ్మారి విషయంలో పరిస్థితి ఆందోళనకరంగా కొనసాగుతోంది. 

ప్రస్తుతం పరీక్షిస్తున్న అనేక నమూనాల్లో డెల్టా–4 మ్యూటేషన్‌ను గుర్తిస్తున్నారు. డెల్టా–1 నుంచి డెల్టా–25 వరకు గుర్తించిన అన్ని మ్యూటేషన్లలో డెల్టా–4 అనే మ్యూటేషన్‌ చాలా వేగంగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ప్రస్తుతం అదే డెల్టా–4 మ్యూటేషన్‌ మహారాష్ట్ర, కేరళలలో వ్యాపిస్తోంది. రాబోయే రోజుల్లో కరోనా థర్డ్‌ వేవ్‌ వస్తే అందులో డెల్టాలో జరుగుతున్న ఈ మ్యూటేషన్లు కీలకంగా మారుతాయనే ఆందోళనన నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీకి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జినోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ (ఐజీఐబీ) ప్రకారం, గత నెలలో మహారాష్ట్రలో 44 శాతం మంది, కేరళలో సుమారు 30 శాతం మంది రోగులలో డెల్టా–4 వేరియంట్‌ కనుగొన్నారు. ప్రస్తుతం డెల్టా –4 వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళనకరమైనదిగా వర్గీకరించింది. అయితే వైరస్‌కు సంబంధించిన ఈ కొత్త మ్యూటేషన్లు కొత్త అంటు వ్యాధులకు కారణం అవుతాయని నిపుణులు భావిస్తున్నారు.

యాక్టివ్‌ కేసులు 0.95% మాత్రమే 
దేశంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కేంద్రం సోమవారం విడుదల చేసిన సమాచారం ప్రకారం  దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 80.85 కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోస్‌లను అందించారు. దేశంలో గతేడాది మార్చిలో కోవిడ్‌ కేసులు ప్రారంభమైన తర్వాత మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.95 శాతంతో అత్యల్పంగా ఉన్నాయి. దేశంలో గత 183 రోజుల్లో అతి తక్కువగా యాక్టివ్‌ కేసులు 3,18,181 కు చేరుకున్నాయి. కాగా గత 24 గంటల్లో 30,256 కొత్త కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 295 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,45,133కు చేరుకుంది. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-05-2022
May 08, 2022, 17:43 IST
కెవాడియా(గుజరాత్‌): కోవిడ్‌ మహమ్మారి వల్ల భారత్‌లో 40.7 లక్షల మంది మృతి చెందారని అంచనా వేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)...
03-05-2022
May 03, 2022, 03:08 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. 12 నుంచి 14 ఏళ్ల పిల్లల్లో 80.82 శాతం...
02-05-2022
May 02, 2022, 03:12 IST
సాక్షి, అమరావతి: కరోనా నుంచి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే టీకాలు అందుబాటులోకి వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని పబ్లిక్‌ హెల్త్‌...
24-04-2022
Apr 24, 2022, 11:03 IST
కన్న తండ్రిని కాపాడుకునేందుకు పడిన వేదన.. ఆస్పత్రి సేవల కోసం చేసిన శోధన.. అంటరాని వాళ్లను చేసి అందరూ దూరం...
21-04-2022
Apr 21, 2022, 11:52 IST
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా వైరస్‌ విజృంబిస్తోంది. కొవిడ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2380...
20-04-2022
Apr 20, 2022, 13:36 IST
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి....
18-04-2022
Apr 18, 2022, 15:39 IST
వైద్య నిపుణుల ఊహ కంటే ముందే భారత్‌లో ఫోర్త్‌ వేవ్‌ అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు పెరుగుతున్న కేసుల్ని...
17-04-2022
Apr 17, 2022, 13:16 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కలవరం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1150 కొత్త కేసులు నమోదుకాగా.....
16-04-2022
Apr 16, 2022, 13:09 IST
సాక్షి, న్యూఢిల్లీ: చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులతో పలు నగరాల్లో కోవిడ్ ఆంక్షలు విధించారు. మరోవైపు భారత్‌లో కూడా...
11-04-2022
Apr 11, 2022, 01:28 IST
అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో కొవ్వు అధికంగా ఉన్నవాళ్లలో రక్తం గడ్డకట్టడం, చిక్కబడడం పెరిగి ప్రమాదాలకు దారి...
06-04-2022
Apr 06, 2022, 18:09 IST
ముంబై: రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తూనే ఉంది. వైరస్‌ కట్టడికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా రూపం మార్చుకొని...
06-04-2022
Apr 06, 2022, 15:27 IST
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గిపోయిందని అనుకోవడానికి లేదు. దీన్ని మనం హెచ్చరికగా తీసుకుని భారత్‌కు ఇక ఏమీ కాదనే...
06-04-2022
Apr 06, 2022, 05:09 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం 16,267 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 30మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో...
27-03-2022
Mar 27, 2022, 21:30 IST
చైనాలో కనివినీ ఎరుగని రీతిలో పెరుగుతున్నకరోనా కేసులు. పరిస్థితి అంత తేలిగ్గా అదుపులోకి వచ్చే స్థితి ఏ మాత్రం కనబడటం లేదు.
21-03-2022
Mar 21, 2022, 12:59 IST
ఫోర్త్‌ వేవ్‌ రూపంలో కాకున్నా జూన్, జూలై నెలల్లో కరోనా కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందన్నారు గాంధీ ఆస్పత్రి...
28-02-2022
Feb 28, 2022, 09:43 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ టీకా కోవోవ్యాక్స్‌ను బూస్టర్‌ డోస్‌గా వాడేందుకు వీలుగా మూడో దశ ట్రయల్స్‌కు అనుమతివ్వాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ డీసీజీఐ...
28-02-2022
Feb 28, 2022, 08:26 IST
హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియాలో వెల్లడించింది. ఈ మేరకు...
24-02-2022
Feb 24, 2022, 14:35 IST
పూర్తిస్థాయిలో కరోనా ముప్పు తొలగిపోలేదని.. వేవ్‌ రాకున్నా, వేరియంట్లు ఉన్నాయని ప్రొఫెసర్‌ రాజారావు అభిప్రాయపడ్డారు.
19-02-2022
Feb 19, 2022, 07:42 IST
సాక్షి, అమరావతి: ముక్కు ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్‌ డ్రాప్స్‌ మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ శుక్రవారం విశాఖపట్నంలోని విమ్స్‌లో ప్రారంభించినట్టు...
17-02-2022
Feb 17, 2022, 18:38 IST
కోవిడ్‌ వైరస్‌ సోకి కోలుకుని అస్సలు టీకాలు తీసుకోని వారిలో దీర్ఘకాలం పాటు కరోనా సమస్యలు, లక్షణాలు కొనసాగుతున్నట్టు వెల్లడైంది. ... 

Read also in:
Back to Top