భారత్‌లో 91 లక్షలు దాటిన కరోనా కేసులు | Corona Updates : India Crosses 91 Lakh Corona Cases | Sakshi
Sakshi News home page

భారత్‌లో 91 లక్షలు దాటిన కరోనా కేసులు

Nov 23 2020 10:50 AM | Updated on Nov 23 2020 12:23 PM

Corona Updates : India Crosses  91  Lakh  Corona Cases - Sakshi

న్యూఢిల్లీ:  భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 44,059 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం మొత్తంగా ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 91 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 511 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,33,738కు చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. మొత్తం కేసుల సంఖ్య 91,39,866గా ఉండగా,  ప్రస్తుతం   4,43,486 యాక్టివ్‌ కేసులున్నాయి. వారిలో ఇప్పటి వరకు 85,62,641 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 93.68 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.46శాతానికి తగ్గిందని బులెటిన్‌లో వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement