Kerala: వందే భారత్‌ రైలుపై కాంగ్రెస్‌ ఎంపీ పోస్టర్లు కలకలం

Congress MP Posters Allegedly Pasted On Kerals Vande Bharat Express - Sakshi

కేరళలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారమే సెమీ హైస్పీడ్‌ రైలు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ రైలు పాలక్కాడ్‌లోని షోరనూర్‌ జంక్షన్‌కు చేరుకోగానే​..కాంగ్రెస్‌ ఎంపీ వీకే శ్రీ కందన్‌ పోస్టర్లు దర్శనమిచ్చాయి. వాస్తవానికి ఆ రైలుకి కొల్లాం, కొట్టాయం, ఎర్నాకులం టౌన్‌, త్రిసూర్‌, షోరనూర్‌ జంక్షన్‌, కోజికోడ్‌, కన్నూర్‌, కాసర్‌గోడ్‌ తదితర ప్రాంతాల్లో హాల్ట్‌లు ఇచ్చారు.

అయితే షోరనూర్‌  జంక్షన్‌లో వందే భారత్‌ రైలు హాల్ట్‌ పొందడానికి ఆయన చూపిన చొరవే కారణమంటూ మద్దతుదారులు కాగ్రెస్‌ ఎంపీ శ్రీకందన్‌ను ప్రశంసిస్తూ.. రైలు షోరనూర్‌ చేరగానే స్వాగతం పలుకుతూ ఆయన పోస్టర్లు పెట్టారు. దీంతో కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ కె సురేందరన్‌ ఒక్కసారిగా విరుచకుపడ్డారు. ఆ కాంగ్రస్‌ ఎంపీ తన మద్దుతుదారులతో కలిసి ఇలాంటి చర్యలకు ఎలా ఒడిగట్టారంటూ మండిపడ్డారు.

ఈ మేరకు కాంగ్రెస్‌ ఎంపీ ‍శ్రీకందన్‌ స్పందిస్తూ..రైల్లో తన పోస్టర్లను అతికించడానికి తాను ఎవరికి అధికారం ఇవ్వలేదని, బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వివాదానికి తెరలేపుతోందని ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా..అందుకు సంబంధించిన దృశ్యాలు మీడియాలో రావడంతో అప్రమత్తమైన రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అధికారులపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 

(చదవండి: ఏపీ భవన్‌ విభజన సమావేశం: తొమ్మిదేళ్లైనా కొలిక్కిరాని పంపకాలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top