భార్య మరొక పురుషునితో.. తట్టుకోలేక భర్త..! | Chennai Wife And Husband Incident Case | Sakshi
Sakshi News home page

భార్య మరొక పురుషునితో.. తట్టుకోలేక భర్త..!

May 3 2026 7:44 AM | Updated on May 3 2026 7:44 AM

Chennai Wife And Husband Incident Case

పారిపోయి, మళ్లీ వచ్చి ఇంట్లో నగలు, డబ్బుతో సతీమణి పరారీ  

తట్టుకోలేక.. ఇద్దరు కొడుకులను చంపి, భర్త ఆత్మహత్య 

తుమకూరు జిల్లాలో విషాదం  

తుమకూరు(కర్ణాటక): రాష్ట్రంలో కుటుంబాల్లో సామూహిక ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. కోలారు జిల్లాలో ఇద్దరు కూతుళ్లతో తల్లి బావిలోకి దూకి ప్రాణాలు తీసుకున్న ఘటన మరువక ముందే మరో విషాదం వెలుగుచూసింది. భార్య మరొక పురుషునితో పరారు కావడంతో తీవ్ర వ్యథ చెందిన భర్త ఘోర కృత్యానికి ఒడిగట్టాడు. ఇద్దరు కొడుకును గొంతు పిసికి చంపి, ఆపై ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దుర్ఘటన తుమకూరు జిల్లా కుణిగల్‌ తాలూకా ఆల్కెరె గ్రామంలో జరిగింది. శివణ్ణ (40), పిల్లలు జీవన్‌ (11), ప్రాణేష్‌ (6) మృతులు. 

ఇంటికి వచ్చినట్టే వచ్చి.. 
వివరాలు.. శివణ్ణ గ్రామంలో మల్లేశ్వరస్వామి ఆలయంలో పూజారిగా ఉంటూ, ఓప్రైవేట్‌ కంపెనీలో కూడా పని చేస్తుండేవారు. భార్య కావ్య, ఇద్దరు పిల్లలతో ప్రశాంత జీవితం గడుపుతుండగా, వారం రోజుల కిత్రం కావ్య వేరే వ్యక్తితో కలిసి ఇంటి నుంచి పరారైంది. ఈ పరిణామంతో భర్త తీవ్రంగా ఆవేదన చెందాడు. భార్య మిస్సింగ్‌పై పోలీసు స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కావ్య మళ్లీ ఇంటికి వచ్చింది. మరుసటి రోజు భర్త పనిమీద వెళ్లగా, కావ్య ఇంటిలోని లక్షలాది రూపాయల విలువ చేసే బంగారు, డబ్బుతో మళ్లీ పరారైంది. దీంతో విరక్తి చెందిన శివణ్ణ శుక్రవారం రాత్రి తన ఇంటిలోనే ఇద్దరు మగ పిల్లలను ఊపిరాడకుండా చేసి చంపి, తర్వాత తానూ ఉరి వేసుకున్నాడు.  

ఆమె కోసం గాలింపు  
శనివారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించగా ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా పోలీసు అధికారులు, కుణిగల్‌ పోలీసులు స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను మరణోత్తర పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. కావ్య కోసం గాలింపు చేపట్టారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇందుకు కారణమైన కావ్య, ఆమె ప్రియున్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement