సీఎం జగన్‌ చూపిన బాటలో కేంద్ర ప్రభుత్వం

Central Govt Gives Rs 10 Lakhs Financial Assistance To Orphan Children Due To Covid - Sakshi

అనాథలైన పిల్లలకు రూ. 10 లక్షలు ఆర్థిక సాయం: కేంద్రం

ఏపీలో వారం రోజుల క్రితమే ఈ పథకాన్ని ప్రకటించిన సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: కోవిడ్‌తో అనాథలైన పిల్లల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చూపిన బాటలో కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. కోవిడ్‌ వల్ల అనాథలైన పిల్లలకు కేంద్రం అండగా నిలవనుంది. ఈ క్రమంలో బాధిత చిన్నారుల పేరు మీద 10 లక్షల రూపాయలు ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఏపీలో ఇప్పటికే సీఎం జగన్‌ ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీలో ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. బాధిత చిన్నారులకు చెక్‌లు కూడా అందించారు. 

ఇక కరోనాతో అనాథలైన పిల్లలకు ఉచిత విద్యను అందించడమే కాక.. 18 ఏళ్ల తర్వాత స్కాలర్‌షిప్‌ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 23 ఏళ్ల తర్వాత వారికి 10 లక్షల రూపాయలు ఇవ్వనుంది. ఆయుష్మాన్‌ భారత్‌ కింద రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమాతో పాటు అనాథ పిల్లల ఉన్నత విద్యకు విద్యారుణం, వడ్డీ కట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 

ప్రజా సంక్షేమ పథకాల విషయంలో ఏపీ సీఎం జగన్‌ పలు రాష్టాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ఏపీలో ప్రవేశపెట్టిన తర్వాతే ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. తాజాగా కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు ఆర్థిక సాయం ప్రకటించే విషయంలో కూడా కేంద్రంతో సహా పలు రాష్ట్రాలు సీఎం జగన్‌ చూసిన బాటలోనే నడుస్తున్నాయి.

కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు ఏపీలో 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన తర్వాత కేరళ సీఎం 3 లక్షలు, తమిళనాడు సీఎం స్టాలిన్‌ 5 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కోవిడ్ కారణంగా తల్లితండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు 25ఏళ్లు వచ్చేవరకూ ప్రతి నెల 2,500 రూపాయలు జమ చేయడమే కాకుండా ఉచిత విద్య అందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

చదవండి: కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు రూ. 10 లక్షలు.. ఉత్తర్వులు జారీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top