 
													
అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసి అధిక ధర చెల్లించేకన్నా 21 రోజుల ముందే తక్కువ ధరల శ్రేణి టికెట్లు బుక్ చేసుకోండి. అనవసరంగా టికెట్లు క్యాన్సిల్ చేయొద్దు.
న్యూఢిల్లీ: రైతులకు ఎరువులు భారీ స్థాయిలో రాయితీలకు ఇస్తుండటంతో ప్రభుత్వంపై పడిన సబ్సిడీ భారం, పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు తదితరాల పథకాల ఆర్థికభారం నుంచి కాస్తంత ఉపశమనం కోసం కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులోభాగంగా ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణ నిమిత్తం చేసే విమాన, రైలు ప్రయాణాల్లో ఖర్చులు తగ్గించుకోవాలంది. ఆ సూచనలు.. 
► అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసి అధిక ధర చెల్లించేకన్నా 21 రోజుల ముందే తక్కువ ధరల శ్రేణి టికెట్లు బుక్ చేసుకోండి. 
► అనవసరంగా టికెట్లు క్యాన్సిల్ చేయొద్దు.  
► వేర్వేరు టైమ్–స్లాట్‌లుంటేనే, తప్పనిసరి అయితేనే రెండు టికెట్లు బుక్ చేయాలి. లేదంటే ఒక ప్రయాణానికి ఒక్కటే తీసుకోవాలి. 
► విమాన టికెట్లను 72 గంటల్లోపు బుక్‌చేసినా, 24 గంటల్లోపు క్యాన్సిల్ చేసినా అందుకు కారణం తెలుపుతూ సంబంధిత విభాగానికి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి.
► తక్కువ క్లాస్ టికెట్‌తోనే ప్రయాణించండి. నాన్–స్టాప్ ఫ్లైట్ అయితే మరీ మంచిది. 
చదవండి👇
ఆర్మీలో అగ్నివీర్ తొలి నోటిఫికేషన్ విడుదల
వందల సంఖ్యలో రైళ్లు రద్దు..రైళ్ల వివరాలు ఇవే..

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
