కుల వివక్ష వెర్రి తలలు.. అంత్యక్రియలను బహిష్కరించిన గ్రామస్థులు..

బరఘా: కుల వివక్ష వెర్రి తలలు ఎలా వేస్తోందో చెప్పే ఉదంతమిది. ఒడిశాలోని బరఘా జిల్లాలో ముచును సంధా అనే వ్యక్తి ఆస్పత్రిలో మరణించారు. పోస్టుమార్టం చేసిన వైద్యడు నిమ్న కులానికి చెందిన వ్యక్తి కావడంతో గ్రామస్తులు ఏకంగా అంత్యక్రియలను బహిష్కరించారు. కనీసం బంధువులెవరూ అటువైపు తొంగి కూడా చూడలేదు. దాంతో గ్రామ సర్పంచ్ భర్త సునీల్ బెహరా ఇలా బైక్ మీద మృతదేహాన్ని తీసుకువెళ్లి ఒకరిద్దరి సహకారంతో అంతిమ సంస్కారం నిర్వహించారు.
చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. 92 మంది ఎమ్మెల్యేల రాజీనామా
సంబంధిత వార్తలు