సుప్రీంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ.. జులై 31 వరకు స్టేటస్‌ కో..

BRS MLAs Poaching Case Supreme Court Postponed July 31st 2023 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సుప్రీం కోర్టు జులై 31కి వాయిదా వేసింది. కేసు న్యాయస్థానం  పరిధిలో ఉన్నందున దర్యాప్తు కొనసాగించవద్దని నిబంధన ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

అప్పటి వరకు  దర్యాప్తు రికార్డులు సీబీఐకి అందించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. దర్యాప్తుపై  స్టేటస్ కో కొనసాగించాలని ఈమేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సోమవారం ఆదేశాలు ఇచ్చింది.

కాగా.. ఎమ్మెల్యేల ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.  సిట్‌ దర్యాప్తు రద్దుచేస్తూ.. కేసుకు  సంబంధించిన  రికార్డులన్నీ సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన తెలిసిందే. 

దీంతో సీబీఐ దర్యాప్తు జరపాలన్న హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని తెలంగాణ సర్కార్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.  దర్యాప్తు సంస్థలన్నీ కేంద్రం గుప్పిట్లోనే ఉన్నాయని, కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తే నీరు గారిపోతుందని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టులో వాదించిన విషయం తెలిసిందే.
చదవండి: నాటు నాటు గీతం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టింది..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top