జాతర్ల సందడి | - | Sakshi
Sakshi News home page

జాతర్ల సందడి

Dec 21 2025 12:44 PM | Updated on Dec 21 2025 12:44 PM

జాతర్

జాతర్ల సందడి

పాలమూరులోని ప్రముఖ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు

కార్తీక మాసంలో మొదలై.. ఉగాది పండుగ వరకు వేడుకలు

తమ ఇంటి ఇలవేల్పుగా కొలిచి మొక్కుల చెల్లింపు

మట్టికుండలో భోజనం, పచ్చిపులుసుతో నైవేద్యం

ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాలకు తిరుమలతో సారూప్యత

వివిధ రకాల వేలం పాటలు, హుండీ ద్వారా రూ.కోట్లలో ఆదాయం ఆర్జన

కురుమూర్తి.. ఘన కీర్తి

చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలో వెలసిన కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర దీపావళి అమావాస్యతో మొదలవుతుంది. రాష్ట్రంలోని మేడారం తర్వాత ఆ స్థాయిలో ఇక్కడికే జనాలు ఇక్కడికి తరలివస్తారు. అలాగే స్వామివారు తిరుపతి వేంకటేశ్వరస్వామి మాదిరిగానే ఏడుకొండల మధ్య కాంచనగుహలో కొలువుదీరారు. మరెక్కడా లేని విధంగా ఉద్దాల ఉత్సవం (పాదరక్షల ఊరేగింపు) ప్రధాన ఘట్టంగా నిలుస్తోంది. చిన్నవడ్డెమాన్‌లో మొదలయ్యే ఈ ఊరేగింపు అప్పంపల్లి, తిర్మలాపూర్‌ గ్రామాల మీదుగా కురుమూర్తికి చేరుకుంటుంది. జాతర దాదాపు నెలరోజులపాటు సాగినా.. భక్తుల రద్దీ దృష్ట్యా మరికొన్ని రోజులు పొడిగించిన సందర్భాలు కోకొల్లలు. అలాగే ఇక్కడ లభించే కాల్చిన మాంసం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి మాంసప్రియులు తరలివస్తారు.

ప్రత్యేకం.. గంగాపూర్‌ ఆలయం

గంగాపూర్‌ గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం కోణార్క్‌ సూర్యదేవాలయం ఒకే విధంగా నిర్మించారని ప్రతీతి. ఈ ఆలయం చతురస్త్రాకారంలో నిర్మితమై ఉండటం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. అలాగే మెట్లు సైతం చతురస్త్రాకారంలో మెట్లు నిర్మించడం వల్ల ఎటు నుంచి చూసినా కోనేరు ఒకేలా కనిపిస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతిఏటా మాఘశుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు కొనసాగుతాయి. ఇక్కడ స్వామివారి కల్యాణోత్సవం, పెద్ద తేరు (రథోత్సవం), చిన్న తేరు (పుష్పరథం), శకటోత్సవం ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఆలయం పడమర ప్రాంతమైన కోయిలకొండ, కోస్గి, కొడంగల్‌, తాండూరు, నారాయణపేట నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారు. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు హాజరవుతారు. కాగా.. జనవరి 19 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

జాతర్ల సందడి 1
1/5

జాతర్ల సందడి

జాతర్ల సందడి 2
2/5

జాతర్ల సందడి

జాతర్ల సందడి 3
3/5

జాతర్ల సందడి

జాతర్ల సందడి 4
4/5

జాతర్ల సందడి

జాతర్ల సందడి 5
5/5

జాతర్ల సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement