120 సీట్లు.. 7,115 విద్యారు్థలు
గద్వాలటౌన్: నవోదయ విద్యాయాల్లో ప్రవేశం కోసం ఎంతోమంది విద్యార్థులు కష్టపడుతుంటారు. తల్లిదండ్రులు సైతం ఆ దిశగా పిల్లలను ప్రోత్సహిస్తుంటారు. గ్రామీణ, పట్టణం తేడా లేకుండా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని నవోదయలో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఉమ్మడి మహబుబ్‌నగర్ జిల్లా (రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కొన్ని మండలాలు)లో నవోదయ ప్రవేశాలకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 29 కేంద్రాలలో 7,115 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయనున్నారు. అంటే 120 సీట్లకు అంత మంది పోటీ పడాల్సి వస్తోంది. డిసెంబర్ 13న నవోదయ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. గంట ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. అరగంట ముందు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
రెండు విద్యాలయాలలో..
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగిన నేపథ్యంలో కొత్త నవోదయ విద్యాలయాలు వస్తే పోటీ తగ్గి ఎక్కువమంది విద్యార్థులకు అవకాశం వస్తుందని అనేకమంది ఎదురుచూశారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం గతేడాది మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో కొత్త నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందుకోసం మహబూబ్‌నగర్ శివారులో స్థల పరిశీలన చేశారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసి తరగతులు కొనసాగిస్తున్నా రు. అందులో 40సీట్లను భర్తీ చేశారు. వట్టెం జవహ ర్ నవోదయ విద్యాలయంలో 80సీట్లు ఉన్నాయి. మొత్తం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న 120సీట్ల కోసం విద్యార్థులు పోటీ పడుతున్నారు.
నాణ్యమైన విద్య..
ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల మోత.. అర్హులైన అధ్యాపకుల లేమి.. తదితర సమస్యలు పూర్తిస్థాయి లో నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో ప్ర వేశాలకు నిర్వహించే అర్హత పరీక్షలో ఒకసారి ప్రవే శం లభిస్తే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూ ర్తయ్యే వరకు అందులోనే నాణ్యమైన విద్య అందు తుంది. క్రీడలకూ ఇక్కడ ప్రాధాన్యం ఇస్తారు. వస తి, భోజనం, పుస్తకాలు, స్టేషనరీ, ఏకరూప దుస్తు లు తదితర అన్నీ కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది.
నడిగడ్డలో ఏర్పాటుకు కృషి చేయాలి
రాష్ట్రంలో పూర్వం 10 జిల్లాలు ఉండగా.. వీటిలో అర్బన్ జిల్లాకు నవోదయ విద్యాలయాలు ఉండవు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 9 జిల్లాల పరిధిలో తొమ్మిది నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ప్రతి విద్యాలయంలో 80 సీట్లు ఉంటాయి. గతేడాది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరికొన్ని నవోదయ విద్యాలయాలను మంజూరు చేస్తూ.. రాబోవు కాలంలో మరిన్ని మంజూరు చేస్తామని ప్రకటించింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్తగా ఏర్పడి జోగుళాంబ గద్వాల జిల్లాకు నవోదయ విద్యాలయం మంజూరైతే ఇక్కడి విద్యార్థులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అక్షరాస్యతలో ఈ జిల్లా ఎంతో వెనుకబడి ఉంది. ఈ ప్రాంతంలో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేస్తే అక్షరాస్యత పెంపుతో పాటు విద్యాభివృద్ధికి బాటలు వేసినట్లవుతుంది. ఆ దిశగా పాలకులు నడిగడ్డలో కొత్త నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కృషి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
నవోదయలోప్రవేశాలకు డిమాండ్
ఉమ్మడి జిల్లా నుంచి
పెద్ద సంఖ్యలో దరఖాస్తులు
నేడే ప్రవేశ పరీక్ష
120 సీట్లు.. 7,115 విద్యారు్థలు
120 సీట్లు.. 7,115 విద్యారు్థలు


