జోరుగా మూడో విడత నామినేషన్లు
నారాయణపేట: జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో మూడో విడత నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగిసింది. మక్త ల్, ఊట్కూర్, కృష్ణా, మాగనూర్, నర్వ మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు, వార్డు సభ్యులకు పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 110 సర్పంచ్ స్థానాలకు గాను తొలిరోజు 60, రెండో రోజు 219, మూడో రోజు 432 మంది అభ్యర్థులు నామనేషన్లు వేయగా.. మొత్తంగా 771 మందికి చేరుకున్నాయి. 994 వార్డులకు గాను తొలిరోజు 66, రెండో రోజు 588, మూడో రోజు 1,021 మంది అభ్యర్థులు కలిపి 1,675 నామినేషన్లు దాఖలయ్యాయి. మక్తల్, నర్వ మండలాల్లో అర్ధరాత్రి వరకు నామినేషన్లు వేస్తున్నారు.


