పర్రిశమలకు గడువులోగా అనుమతులు
నారాయణపేట: జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ టీజీ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖల నుంచి నిర్దేశిత గడువులోగా అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం కలెక్టర్ చాంబర్‌లో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశానికి హాజరై ఆమె మాట్లాడారు. ఎస్సీ 12, ఎస్టీ 4, పీహెచ్‌సీ 1కి సంబంధించి పెట్టుబడి సబ్సిడీ మంజూరుకు డిఐపిసి కమిటీలో ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో జీఎం లింగేశ్వర్ గౌడ్, ఐపీఓ నర్సింగ్ రావు, ఎల్‌డీఎం విజయ్ కుమార్ సీటిఓ ప్రవీణ్ కుమార్, నరేశ్, అసిస్టెంట్ హైడ్రాలాజిస్ట్,ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్, విద్యుత్ ఎస్సీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
‘చదువుల పండుగ’ కొనసాగించాలి
జిల్లాలో చదువుల పండగ కార్యక్రమం కొనసాగించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శనివారం అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన మార్కులు, హాజరు వివరాలు వారి తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు తెలుసుకునే ఉదంగత్ యాప్‌ను డెవలప్ చేయాలన్నారు. విద్యార్థులకు ప్రత్యేక పీటీఎం, పదో తరగతి అనంతరం విద్యార్థులు ఇంటర్ ఎక్కడ చదువుతారో అధికారులు రికార్డు చేయాలన్నారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, బాల్యవివాహాలను అరికట్టడానికి ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. ఈ సమావేశంలో ట్రైని కలెక్టర్ ప్రణయ్, ఆర్డీఓ రాంచందర్, డిప్యూటీ కలెక్టర్ ట్రైని శ్రీరామ్ ప్రణీత్, ఫణిరాజ్ డిప్యూటీ కలెక్టర్ ట్రైని, డిపిఓ సుధాకర్ రెడ్డి, రాజేష్ కుమార్, యాద్దయ్య తదితరులు పాల్గొన్నారు.


