చదువుతో ఏదైనా సాధించవచ్చు
నారాయణపేట రూరల్: ప్రతి వ్యక్తి జీవితంలో చదువుతూనే ఎంతటి స్థాయినైనా పొందవచ్చునని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిమళపురంలో శుక్రవారం నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేటి పిల్లలే రేపటి పౌరులు అని, ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఆటలలో కూడా ముందుండాలని సూచించారు. చదువు ద్వారా ఏదైనా సాధించడం సాధ్యమని, చదువు చాలా ముఖ్యమని విద్యార్థులకు సూచించారు. బాలల దినోత్సవ వేడుకల్లో భాగంగా పాఠశాలలో వైఓసి క్లబ్ ను, మిడ్‌ఇయర్ షోకేస్‌ను నిర్వహించారు. విద్యార్థులు చేపట్టిన వివిధ కార్యకలాపాలను తిలకించారు. చక్కటి ప్రతిభను ప్రదర్శించగా కలెక్టర్ వారిని అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయు బృందం పాల్గొంది.


