10 వేల ఎకరాలు సాగైతే పరిశ్రమ..
జిల్లాలో 10 వేల ఎకరాలు సాగైతే జిల్లాలోని మరికల్ మండలం చిత్తనూర్ వద్ద 80 ఎకరాల్లో రూ.300 కోట్లతో ఆయిల్‌ఫెడ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఇటీవల ప్రకటించారు. ఇదిలాఉండగా, జిల్లాలోని మరికల్ మండలం కన్మనూర్‌లో నర్సరీని ఏర్పాటు చేసి జిల్లా రైతులకు సరిపడా ఆయిల్‌పాం మొక్కలను సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 6700 ఎకరాలు సాగవుతోంది. ఇక ఆయిల్‌పాం సాగుకు ముందుకు వచ్చే రైతులకు మొక్కలతోపాటు ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీపై, బీసీలకు 80 శాతం రాయితీపై డ్రిప్‌ను అందిస్తోంది. ఇక పంట కొనుగోలు కోసం ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్‌సీడ్ గ్రోవర్స్ ఫెడరేషన్ ముందుకు వచ్చింది. ఇందు కోసం జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి వద్దనున్న ఆయిల్ ఫ్యాక్టరీని పునరుద్దరించారు. పంట కోత మొదలైనప్పటి నుండి కొనుగోలు వరకు సంస్థనే రవాణ చార్జీలు చెల్లిస్తోంది.


