డ్రమ్ములో పడి బాలుడి మృతి
గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు నీళ్ల డ్రమ్ములో పడి మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. తల్లిదండ్రుల కథనం మేరకు.. గద్వాల మండలంలోని కుర్వపల్లికి చెందిన కుర్వ నారాయణ, పావని దంపతుల కుమారుడు వీరేష్ (3) బుధవారం ఉదయం ఇంటి ఆవరణలో ఆడుకుంటూ.. సమీపంలోని డ్రమ్ములో నీళ్లు తీసుకునేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. గమనించిన తల్లిదండ్రులు బయటకు తీశారు. బాలుడు అపస్మారక స్థితిలో ఉండడంతో చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.
బావిలో పడి వ్యక్తి మృతి
● ఆలస్యంగా వెలుగులోకి
ఉప్పునుంతల: మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో పాడుబడిన మాదిగ బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అచ్చంపేట మండలం లింగోటం తండాకు చెందిన కాట్రావత్ శంకర్ (38) చెత్త ఏరుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలో పది రోజుల క్రితం బావి అంచున చెత్త ఏరుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతి చెందాడు. శంకర్ అదృశ్యంపై కు టుంబ సభ్యులు అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బుధవారం బావిలో తేలిన శవాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా శంకర్‌గా గుర్తించారు. పో స్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అచ్చంపేట ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
అనుమానాస్పదంగా
వివాహిత..
ఊట్కూర్: మండలంలోని పులిమామిడి గ్రా మంలో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథ నం మేరకు.. మండలంలోని మోగ్దుంపూర్ గ్రామానికి చెందిన రాఘవ కూతురు అన్నపూర్ణ (28)ను పులిమామిడి గ్రామానికి చెందిన బుడ్డోళ్ళ రాముతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి 10 నెలల కుమారుడు ఉన్నాడు. అన్నపూర్ణ బుధవారం తెల్లవారు జామున అనుమానాస్పదంగా ఇంట్లో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు వచ్చి వేధింపుల వల్లే తమ కూతురు మృతి చెందినట్లు ఆరోపించారు. దీంతో ఇరు గ్రామాల పెద్దలు పంచాయితీ నిర్వహించినట్లు తెలిసింది. ఈ సంఘటనపై ఎస్‌ఐ రమేష్‌ను వివరణ కోరగా తనకు ఫిర్యాదు అందలేదని తెలిపారు.
యువకుడి బలవన్మరణం
కొత్తకోట రూరల్: ఫ్యాన్ కు ఉరేసుకుని యువకుడి బ లవన్మరణానికి పాల్ప డిన ఘటన పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసముంటున్న జనంపల్లి అశోక్(35) పె యింటర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల కుటుంబంలో గొడవలు, ఆర్థి క ఇబ్బందుల నేపథ్యంలో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతుడికి భార్య శాంతమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారు డు ఉన్నారు. ఆత్మహత్యపై ఎస్‌ఐ ఆనంద్‌ను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.
చికిత్స పొందుతూ
వృద్ధుడు మృతి
మరికల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఓ వృద్ధుడు బుధవారం మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని పస్పుల గ్రామానికి చెందిన ముష్టి తిర్మలయ్య (56) ఈ నెల 14న పస్పుల స్టేజీ సమీపంలో ఉన్న పెట్రోల్ బంకులో తన బైక్‌కు పెట్రోల్ పోయించుకొని రోడ్డు ఎక్కుతుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో తిర్మలయ్య తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
కల్లు సీసాలో ఎలుక
కోస్గి: ఓ మహిళా తాగేందు కు తీసుకున్న కల్లు సీసాలో చనిపోయిన ఎలుక వచ్చింది. వివరాల్లోకి వెళితే నారాయణపేట జిల్లా కోస్గి మండలం నాగుసాన్‌పల్లి గ్రా మానికి చెందిన బాలమణి బుధవారం రాత్రి కల్లు దుకాణానికి వెళ్లింది. కల్లు సీసాను కొను గోలు చేసి అక్కడే తాగుతుండగా.. సీసాలో నుంచి కల్లు బయటకు రావడం ఆ గిపోయింది. విద్యుత్ వెలుతురు వద్దకు తీసుకొచ్చి సీసాను గమనించగా చనిపోయిన ఎలుక కనబడింది.దీంతో అక్కడే కల్లు తాగు తున్న మ రికొందరు వెంటనే అప్రమత్తమై కల్లు పారబోశారు. ఈ విషయమై సంబంధిత కల్లు దుకాణాదారుడు వెంకటయ్యను అడిగేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.
డ్రమ్ములో పడి బాలుడి మృతి
డ్రమ్ములో పడి బాలుడి మృతి
డ్రమ్ములో పడి బాలుడి మృతి
డ్రమ్ములో పడి బాలుడి మృతి


