 
															జూరాలకు 27 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ధరూరు/ఆత్మకూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో స్వల్పంగా పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. మంగళవా రం రాత్రి 7.30 గంటల వరకు ప్రాజెక్టుకు 25 వేల ఇన్‌ఫ్లో ఉండగా.. బుధవారం సాయంత్రం 5 గంట ల వరకు 27 వేల క్యూసెక్కులకు పెరిగింది. విద్యుదుత్పత్తి నిమిత్తం 21,098 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 23 క్యూసెక్కులు, కుడి కాల్వకు 450 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 21, 571 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.111 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఏడు యూనిట్లలో విద్యుదుత్పత్తి
ప్రియదర్శిని జూరాల దిగువ, ఎగువ జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో 7 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. ఎగువలో 4 యూనిట్ల ద్వారా 156 మెగావాట్లు, దిగువలో 3 యూనిట్ల ద్వారా 120 మెగావాట్లు విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్, డీఈ పవన్‌కుమార్ తెలిపారు.
శ్రీశైలంలో 883.9 అడుగుల నీటిమట్టం
దోమలపెంట: శ్రీశైలం జలాశయంలో బుధవారం 883.9 అడుగుల వద్ద 209.6 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. సుంకేసుల నుంచి 17,518 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 1,125 క్యూసెక్కులు, జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ 20,991 క్యూసెక్కులు కలిపి మొత్తం 39,634 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 26,617 క్యూసెక్కులు కలిపి మొత్తం 61,532 క్యూసెక్కుల నీటిని దిగువన సాగర్‌కు వి డుదల చేస్తున్నారు. ఇరవై నాలుగు గంటల వ్యవధి లో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి 1,009 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 17.196మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 2.620మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు.
కోయిల్‌సాగర్ పరవళ్లు..
తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతుంది. మోంథా తుపాను కారణంగా జిల్లాలో విస్తృతంగా వర్షాలు కురుస్తుండడంతో కోయిల్‌సాగర్ ఎగువ ప్రాంతం నుంచి పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో అధికారులు బుధవారం సాయంత్రం 5 గేట్లను తెరిచి 7 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి నీటి ఉధృతి పెరిగితే మరిన్ని గేట్లను తెరిచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
