హనుమద్వాహనంపై కురుమతిరాయుడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా కురుమూర్తి స్వామి, పద్మావతి అమ్మవార్లు సోమవారం రాత్రి హనుమద్వాహనంపై విహరించారు. ముందుగా ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి ఆలయం నుంచి
కల్యాణకట్ట వరకు సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణతో కురుమూర్తిగిరులు మార్మోగాయి. ఆలయ చైర్మన్
గోవర్ధన్‌రెడ్డి, ఈఓ మదనేశ్వరెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
– చిన్నచింతకుంట
హనుమద్వాహనంపై కురుమతిరాయుడు


