
14న ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి ఎన్నిక
నారాయణపేట: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ పదవీకాలం ముగియడంతో కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఆదేశాలతో ఈ నెల 14న ఉదయం 11 గంటలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో ఎన్నికల సమావేశం నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి శంకరాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో 15 మంది కార్యవర్గ సభ్యులు, ఆఫీసు బేరర్లు అయిన చైర్మన్, వైస్ చైర్మన్, ట్రెజరర్, రాష్ట్ర కార్యవర్గ నాయకుల ఎన్నిక జరుగుతుందన్నారు. రహస్య బ్యాలెట్ ద్వారా జరిగే ఎన్నికలకు ప్రతి సభ్యుడు హాజరుకావాలని కోరారు.
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
కృష్ణా: మండల సరిహద్దులోని చెక్‌పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని మక్తల్ సీఐ రాంలాల్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఎస్‌ఐ ఎండీ నవీద్‌తో కలిసి సరిహద్దులోని చెక్‌పోస్టును సందర్శించా రు. అనంతరం మాట్లాడుతూ కర్ణాటక నుంచి అక్రమంగా రవాణా అవుతున్న మద్యం, గంజాయితో పాటు ఇతర నిషేధిత పదార్థాలు రాష్ట్రంలోకి రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.