
దసరా సంబురం..!
నారాయణపేట/మక్తల్: జిల్లా వ్యాప్తంగా విజయదశమి వేడుకలను గురువారం ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ఆయుధపూజ, జమ్మి ఇచ్చి పుచ్చుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు. ఇంటిల్లిపాది ఒక్కచోటకు చేరి పిండివంటల ఘుమఘుమలతో ప్రతి ఇంట్లో పండగ శోభకొట్టొచ్చింది. జిల్లా కేంద్రంలోని బారంబావి దగ్గర ఆర్యసమాజ్, ఆర్ ఎస్‌ఎస్, భజరంగ్ దళ్, నగర ఉత్సవ సమితి, విశ్వ హిందూపరిషత్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. అలాగే, ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. పట్టణంలోని శ్రీరాఘవేంద్ర స్వామి, శ్రీ బాలాజీ మందిర్, అంబభవానీ, మర్గమ్మ మందిర్, చౌడేశ్వరి, శ్రీ పాండురంగస్వామి, శక్తిపీఠం ఆలయాలతో పాటు పట్టణ శివారులోని ఎక్లాస్పూర్ బాలాజీ, లోకాయపల్లి లక్ష్మమ్మ, కర్ణాటక రాష్ట్రంలోని యానగుంది మాణిక్యగిరిలో కోలువుదీరినా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కేంద్రంలో ఆర్య సమాజం మందిరంలో ఆర్య సమాజ్ అధ్యక్షుడు విజయ్‌కుమార్ సర్వోదేమంత్రి కుమారి నాగమ్మ ఆధ్వర్యంలో ముఖ్య అతిథి దేవదత్త సర్వదే పాల్గొని ధ్వజహారణ కార్యక్రమాన్ని బీకేఎస్ రాష్ట్ర జోనల్ కార్యదర్శివెంకోబచే ఓంకార ధ్వజ పతావిష్కరణ చేశారు. ఆ తర్వాత ధ్వజారోహణను బీకేఎస్ నాయకులు వెంకోభకు ఓంకారం జెండాను బీజేపీ రాష్ట్ర నేత నాగూరావు నామాజీ అందించగా.. పురవీధుల గుండా ఊరేగింపు చేపట్టారు. జమ్మి కొమ్మలను తీసుకువచ్చి బారంబావి దగ్గర ప్రత్యేక పూజలుచేశారు. ఆ తర్వాత రావణ దహన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతం ఒకరికొకరు జమ్మిని పంచు కుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
షమీ వృక్షానికి ప్రత్యేక పూజలు
పట్టణం, మండలంలోని కోటకొండ, కొల్లంపల్లి, జాజాపూర్ తదితర గ్రామాల్లోని వివిధ ఆలయాల్లో కొలువైన జమ్మి వృక్షానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. విజయదశిమిని పురస్కరించుకుని షమీ వృక్షా నికి పూజలు చేసి జమ్మి ఆకులను ఇంటికి తీసుకువెళ్లి సాయంత్రం వేళలో ఒకరికొకరు పం చుకుని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
సకలజనులంతా సుభిక్షంగా ఉండాలి
ఏ పండుగైనా సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా ఉండాలని... సకలజనులంతా సుభిక్షంగా ఉండాలని, అందరికీ అష్టైశ్వర్యాలు ప్రసాదించి ఆరోగ్యంగా ఉండేటట్లు రైతు కుటుంబాల్లో ఆర్థికంగా స్వలంబన పుష్కలమైన పంటలు పండాలన్నాని వక్తలు ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని బారంబావి దగ్గరలోని రాంలీలా మైదానం లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వక్తలు పాల్గొని హైందవ సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు దసరా విశిష్టతను వివరించారు. ఓంకార నినాదాలతో శ్రీ దయానంద సరస్వతి మార్గ సూత్రాలను పాటించియాగ యజ్ఞాలకు ప్రాధాన్యత ఇవ్వాలని వారి అడుగుజాడల్లో ముందుకు తీసుకుపోయే మార్గాలను వారు సందేశాన్నిచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ఉత్సవాలు జరుపుకొంటున్నమన్నారు. నాటి కాలంలో చత్రపతి శివాజీ కాలుమోపిన నేల నారాయణపేట అన్నారు. ఉత్సవాల్లో బీజేపీ రాష్ట్ర నాయకుడు రతంగ్‌పాండురెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు రతంగ్‌పాండురెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్, గణేశ్, దసరా ఉత్సవ నాయకులు పాల్గొన్నారు.
ఆలయాల్లో, జమ్మిచెట్టు వద్ద
ప్రత్యేక పూజలు
మక్తల్‌లో మంత్రి ఆధ్వర్యంలో అట్టహాసంగా వేడుకలు
పేట ఆర్యసమాజ్, వీహెచ్‌పీ
ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు
రాంలీల మైదానంలో సభ,
రావణ దహనం

దసరా సంబురం..!

దసరా సంబురం..!