
జమ్మిని బంగారంగా స్వీకరించే గొప్ప సంస్కృతి
నారాయణపేట: జమ్మి ఆకును బంగారంగా స్వీకరించే గొప్ప సంస్కృతి మనదని, పాలపిట్ట, జమ్మి చెట్టును రాష్ట్ర చిహ్నాలుగా గుర్తించిన ఘనత రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్‌దేనని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ప్రజలందరికీ అన్నారు. గురువారం కోయిలకొండ మండలం శేరివెంకటాపూర్‌లో విజయదశమి పర్వదినం సందర్భంగా జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జమ్మి ఆకును బంగారంగా నియోజకవర్గ ప్రజలకు స్వీకరించి.. అందరిలో చెడు తొలిగి మంచి ఆలోచనలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రామన్‌పాడులో
తగ్గిన నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శుక్రవారం సముద్ర మట్టానికిపైన 1,020 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ కాల్వ నుంచి 730 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 872 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 50 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగిస్తున్నామని వివరించారు.
నియోజకవర్గ ఏర్పాటుకు సహకరించండి
అమరచింత: కోల్పోయిన అమరచింత నియోజకవర్గాన్ని తిరిగి సాధించుకునేందుకు తోడ్పాటునందించాని నియోజకవర్గ సాధన సమితి సభ్యులు బీజేపీ పంజాబ్, చండీఘడ్ రాష్ట్రాల సంస్థగత కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌ను కోరారు. దసరా పండుగకు స్వగ్రామం అమరచింతకు వచ్చిన మంత్రి శ్రీనివాస్‌ను గురువారం వారు కలిసి మాట్లాడారు. అమరచింత నియోజకవర్గ ఏర్పాటుకుగాను అన్ని రాజకీయ పార్టీల నేతల మద్దతుతో ముందుకెళ్తున్నామన్నారు. అదేవిధంగా జిల్లాకు మంజైరైన కేంద్రీయ విద్యాలయాన్ని అమరచింతలో ఏర్పాటు చేసేలా చూడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక పంపిస్తే కేంద్ర మానవ వనరులశాఖ మంత్రిని కలిసి విద్యాలయం ఏర్పాటుకు తనవంతు ప్రయ త్నం చేస్తానని కేశం నాగరాజ్‌గౌడ్‌కు సూ చించారు. నియోజకవర్గ సాధనలో పట్టణ పౌరుడిగా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.