
మక్తల్‌లో అంబరాన్నంటిన సంబరాలు..
మక్తల్‌లో దసరా సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యసహకార, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కుటుంబ సమేతంగా పడమటి ఆంజనేయస్వామి, వేంకటేశ్వరస్వామి ఆలయంలో, జమ్మిచెట్టు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇదిలాఉండగా, తొమ్మిదిరోజులపాటు ప్రత్యేక పూజలు అందుకున్న అమ్మవారిని భారీ ఏర్పాట్ల నడుమ శోభాయాత్ర నిర్వహించారు. ప్రత్యేకంగా మహారాష్ట్ర నుంచి వచ్చిన ప్రత్యేక బ్యాండ్ బృందం, వివిధ వేషధారణల కళాకారుల ఆకట్టుకున్నారు. పట్టణంలోని నల్లజానమ్మ ఆలయం నుంచి పాతబజారు, నేతాజీనగర్, వాకిటి వీధి మారుతినగర్, యాదవనగర్, గోపాలస్వామి గుడి మీదుగా రాంలీలా మైదానానికి శోభాయాత్ర చేరుకుంది. అక్కడే మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఆ ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. అనంతరం అమ్మవారిని నిమజ్జనం చేశారు. సాయంత్రం మైదానంలో రావణాసురిడి కటౌట్‌ను బాణాసంచా పేలుళ్ల నడుమ దహనం చేశారు. ఇదిలాఉండగా, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి సైతం పూజల్లో పాల్గొన్నారు.
మక్తల్‌లోని ఆలయంలో పూజలు చేస్తున్న
మంత్రి వాకిటి శ్రీహరి, కుటుంబసభ్యులు
మక్తల్‌లో వివిధ వేషధారణల్లో కళాకారులు..

మక్తల్‌లో అంబరాన్నంటిన సంబరాలు..