
ప్రజావాణికి 46 దరఖాస్తులు
నారాయణపేట: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరగా పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్ల క్ష్యం వహించొద్దని తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.