
‘బలవంతపు భూ సేకరణ ఆపండి’
నారాయణపేట: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథ కం భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ నుంచి భూ నిర్వాసితులు ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు. అయితే శాసనపల్లి రోడ్డులో పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి మూడు గంటలపాటు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఆర్డీఓ రైతులను బెదిరింపులకు గురిచేస్తూ భూ సేకరణ చేపట్టడం సరికాదన్నారు. బహిరంగ మార్కెట్ ధరకు అనుగుణంగా, 2013 భూ సేకరణ చట్టం మేరకు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించినా తర్వాతే భూ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తరతరాలు గా సాగుచేసుకుంటు న్న భూమిని అన్యాయంగా సేకరించొద్ద ని అన్నారు. భూ నిర్వాసితుల సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు మశ్చందర్ మా ట్లాడుతూ.. రైతులకు న్యాయమైన పరిహారం అందే దాక తమ పోరాటం ఆగదన్నారు. కాగా, భూ నిర్వాసితుల ఆందోళనకు పాలమూరు అ ధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి మద్దతు తెలిపారు. ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న 20 గ్రామాల నుంచి రైతు లు పెద్దఎత్తున తరలివచ్చారు. కలెక్టర్ రావాలని.. లేదంటే తామే కలెక్టరేట్‌కు వెళ్తామని పెద్దపెట్టున నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ రైతుల వద్దకు చేరుకోగా.. వినతిపత్రం సమర్పించారు. కా ర్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్, కార్యదర్శి అంజిలయ్యగౌడ్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జోషి, వికలాంగుల హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు కాశప్ప, భూ నిర్వా సితుల సంఘం నాయకులు ధర్మరాజు, ఆంజనేయులు, హనుమంతు, అంజప్ప పాల్గొన్నారు.

‘బలవంతపు భూ సేకరణ ఆపండి’