
మరింత సహకారం!
వివరాలు 8లో u
కోస్గి: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సాగులో అధిక దిగుబడులు సాధించడమే కాకుండా వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సా గుతోంది. ఇప్పటికే రైతులకు అనేక సేవలందిస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులను సంఘటితపరిచి మరిన్ని సేవలు అందించేందుకు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా కృషి చేస్తోంది. అందులో భాగంగా రైతులకు అశేష సేవలందిస్తున్న నాలుగు పీఏసీఎస్‌లను రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఎంపిక చేసింది. ఎఫ్‌పీఓగా గుర్తించిన ఒక్కో పీఏసీఎస్‌కు ఎన్‌సీడీపీ నుంచి తొలి విడతగా రూ.3.16 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆయా సంఘా ల్లో ప్రత్యేకంగా కార్యాలయ ఏర్పాటుకు అవసరమై న ఫర్నిచర్, కంప్యూటర్, ఇతర సామగ్రి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఎంపికై న సొసైటీలకు ప్రతి సంవత్సరం కార్యాలయ నిర్వహ ణ కోసం రూ.6లక్షలు, వ్యాపార నిర్వహణ కోసం మరో రూ. 5లక్షలు కలిపి మూడేళ్ల కాలంలో రూ. 33లక్షలను ప్రభుత్వం మంజూరు చేయనుంది.
ఎఫ్‌పీఓల ప్రధాన లక్ష్యం..
రైతుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఎఫ్‌పీఓలు పనిచేయనున్నాయి. ముఖ్యంగా భూసార పరీక్షలు, విత్తన స్వావలంబన, సరైన ఎరువుల ఎంపిక, జలవనరుల సద్వినియోగం, సాంకేతికత వినియోగం, లాభసాటి వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించడం, మార్కెట్ సౌలభ్యం, సహజ, సేంద్రియ పంటలు పండించడం, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించడం వంటి వాటికి ప్రోత్సాహం అందించనున్నారు. భూమి, నీరు, గాలి కాలుష్య నియంత్రణ, వ్యవసాయ ఆధారిత, వ్యవసాయేతర వ్యాపారాల నిర్వహణ, గ్రామీణ యువత, మహిళలు వ్యవసాయేతర ఉత్పత్తుల వారికి సహాయ పడటం, సంపద సృష్టి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించడం లక్ష్యంగా ప్రభుత్వం ఎఫ్‌పీఓలను ప్రారంభించింది.
● జిల్లాలోని 13 మండలాల పరిధిలో 10 పీఏసీఎస్‌లు ఉన్నాయి. వీటిలో ధన్వాడ, ఊట్కూర్, మాగనూర్, తీలేరు పీఏసీఎస్‌లను రైతు ఉత్పత్తి సంఘాలకు ఎంపిక చేశారు. వీటికి మొదటి విడత నిధులను అందజేశారు. సొసైటీల్లో రైతుల వాటాధనం కింద ఒక్కొక్కరు రూ. 2వేల చొప్పున చెల్లించి.. 750 మంది రైతులు సభ్యులుగా చేరి రూ.15 లక్షలు జమ చేయాల్సి ఉంటుంది.
రైతులకు ఎంతో ప్రయోజనం...
రైతులు జమచేసిన వాటాధనం ఆధారంగా ఎస్‌సీడీసీ మంజూరుచేసే రుణంతో సంఘం ఆధ్వర్యంలో ఎరువులు, విత్తనాలను నేరుగా రైతులకు విక్రయించాల్సి ఉంటుంది. వివిధ వ్యాపారాల నిర్వహణ ద్వారా సంఘానికి వచ్చిన లాభాన్ని ఏటా సభ్యులకు వాటాధనం ఆధారంగా చెల్లిస్తారు. త్వరలోనే ఎఫ్‌పీఓలుగా ఎంపికై న సొసైటీల్లోని సభ్యులకు సంఘం ఏర్పాటు చేయడం.. ఎలా అభివృద్ధి చేయాలనే విషయమై శిక్షణ ఇవ్వనున్నారు.
నిధుల వినియోగం ఇలా...
ప్రభుత్వం మంజూరుచేసే నిధులను ఆయా సొసైటీలు నిబంధనల మేరకు వినియోగించాల్సి ఉంటుంది.
సీఈఓ వేతనం రూ. 25వేలు, అకౌంటెంట్ జీతం రూ.10 వేలకు మించకుండా ఖర్చు చేయాలి.
కంప్యూటర్, ప్రింటర్, ఇతర సామగ్రి కొనుగోలు కోసం గరిష్టంగా రూ. లక్ష వరకు ఖర్చు చేయవచ్చు.
కార్యాలయ భవనం అద్దె కింద ఏడాదికి రూ. 48వేలు, విద్యుత్, టెలిఫోన్ చార్జీల కోసం రూ. 12వేలు, ప్రయాణ, సమావేశాల ఖర్చుల కోసం రూ. 18వేలు, స్టేషనరీ, ఇతర ఖర్చుల కింద రూ. 12వేలకు మించొద్దు.
రైతు ఉత్పత్తి సంఘాలుగాపీఏసీఎస్‌లు
అన్నదాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చర్యలు
జిల్లాలో మొదటి విడతగా నాలుగుసొసైటీల ఎంపిక
వాటాధనం చెల్లించిన రైతులను సభ్యులుగా నమోదు చేస్తున్న అధికారులు

మరింత సహకారం!