
రైతులకు విస్తృత సేవలు..
సహకార సంఘాన్ని ఎఫ్‌పీఓగా గుర్తించడం ద్వారా రైతులకు మరిన్ని సేవలు అందనున్నాయి. వివిధ వ్యాపారాల నిర్వహణతో సంఘం ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు సభ్యులకు సైతం లాభాలు వస్తాయి. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషిచేస్తా.
– వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, మాగనూర్
వ్యాపార ప్రణాళికలు..
ఎఫ్‌పీఓలుగా ఎంపికై న సొసైటీల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి.. రైతుల నుంచి వాటాధనం వసూలు చేసి సభ్యులుగా నమోదు చేస్తున్నాం. మొదటి విడతగా ఒక్కో సంఘానికి వచ్చిన రూ. 3.16లక్షల చొప్పున వచ్చిన నిధులను ఆయా సొసైటీలకు అందజేశాం. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసుకొని ఆయా ప్రాంతాలకు అనుగుణంగా వ్యాపార ప్రణాళికలు రూపొందించుకోవాలి.
– శంకరాచారి,
జిల్లా కోఆపరేటివ్ ఇన్‌చార్జి అధికారి
●

రైతులకు విస్తృత సేవలు..