
విధుల్లో బాధ్యతగా వ్యవహరించాలి: ఎస్పీ
నారాయణపేట క్రైం: ప్రజలకు బాధ్యతాయుతంగా సేవలందిస్తే సమాజంలో పోలీసులపై గౌరవం పెరుగుతుందని, ఉద్యోగికి పదోన్నతి ఉత్సాహంతో పాటు బాధ్యత పెంచుతుందని ఎస్పీ యోగేష్‌గౌతమ్ అన్నారు. జిల్లా పోలీసు హెడ్ క్వాటర్స్‌లో బుధవారం ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు రవి, బాలునాయక్ హెడ్ కానిస్టేబుల్స్‌గా పదోన్నతి పొందడంతో వారు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుళ్లకు హోదాకు సంబంధించిన పట్టీలు అలంకరించి, వారిని అభినందించారు. అనంతరం ఎస్సీ మాట్లాడుతూ.. పోలీసులు విధి నిర్వహణలో తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందిచాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రియాజ్‌హుల్‌హాక్, ఆర్‌ఐ నరసిహులు పాల్గొన్నారు.
27న లైసెన్స్
సర్వేయర్లకు పరీక్ష
నారాయణపేట: లైసెన్స్ సర్వేయర్ల కోసం ఈ నెల 27న పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. 23 నుంచి అభ్యర్థులు వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వడం ద్వారా అధికారిక పోర్టల్ నుంచి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రానికి చెల్లుబాటు అయ్యే ఫొటో ఐడీతో పాటు హాల్ టికెట్ ముద్రిత కాపీని తప్పకుండా తీసుకెళ్లాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://ccla.tela ngana.gov.in/employeeDetails.do ను చూడవచ్చని తెలిపారు.