
ధరలు తగ్గించాలి..
రెండు ఎకరాల్లో వరిపంట సాగుచేస్తున్నా. ఏటా పెట్టుబడి కింద రూ. 5వేల అదనపు భారం పెరుగుతూనే ఉంది. ఇందుకు ప్రతి ఏడాది ఎరువుల, కూలీల ధరల పెంపే కారణం. కానీ రైతు పండించిన పంటకు మాత్రం ఒకే ధర ఉంటుంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక నష్టపోతున్నాం. పెంచిన ఎరువుల ధరలను తగ్గిస్తే కొంతమేర పెట్టుబడి తగ్గే అవకాశం ఉంది. లేదంటే పంటసాగుకు పెట్టిన పెట్టుబబడులు రాని పరిస్థితి వస్తుంది.
– గొల్ల రాములు, రైతు, మరికల్
సేంద్రియ వ్యవసాయంతో మేలు
పెరిగిన ఎరువుల ధరలను దృష్టిలో ఉంచుకొని రైతులు ఫర్టిలైజర్ ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవడం మంచింది. ఈ ఎరువుల వల్ల భవిష్యత్‌లో భూ సారం తగ్గి పంటల దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రైతులు సాగుచేసే పంటలకు సేంద్రియ ఎరువులను వినియోగించడంతో భూ సారం పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చు. – జాన్‌సుధాకార్,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి
●