
క్రికెట్‌లో మెరుపులు
బ్యాట్ పడితే సిక్స్.. బంతి విసిరితే బౌల్డ్
మహబూబ్‌నగర్‌కు చెందిన ముఖితుద్దీన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఇంట్రా డిస్ట్రిక్ట్ అండర్–23 టూ డే లీగ్‌లో బంతిని గింగిరాలు తిరిగేలా బ్యాట్స్‌మెన్‌లను బోల్తా
కొట్టించారు. తన స్పిన్ మాయాజాలంతో టోర్నీలో అత్యధికంగా 34 వికెట్లు తీశా డు. రెండు ఇన్నింగ్స్‌లలో వనపర్తి, నారాయణపేట జట్లపై 10 చొప్పు న వికెట్లు, జడ్చర్లపై 5, గద్వాలపై 5, నాగర్‌కర్నూల్‌పై 4 వికెట్లు తీసి రాణించాడు. గతంలో పలుసార్లు హెచ్‌సీఏ టోర్నీల్లో ఎండీసీఏ తరఫున ఆడి ప్రతిభ చాటాడు. 2024లో వరంగల్‌లో జరిగిన హెచ్‌సీఏ అండర్–19 టోర్నీలో 5 మ్యాచుల్లో 14 వికెట్లు తీసి ఉత్తమ బౌలర్‌గా నిలిచాడు. ఈ ఏడాది చైన్నెలో జరిగిన ఆలిండియా యూనివర్సిటీ క్రికెట్ టోర్నీలో నాలుగు ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీశాడు. గతేడాది త్రీ డే లీగ్‌లో 8 వికెట్లు తీశాడు. భవిష్యత్‌లో రంజీ, భారత జట్టుకు ఆడడమే తన లక్ష్యమంటున్నాడు ముఖితుద్దీన్.
● ఆకాశమే హద్దుగా
చెలరేగుతున్న వైనం
● సత్తా చాటుతున్న మహిళా క్రికెటర్లు
● అద్భుతంగా రాణిస్తున్న పాలమూరు
యువ క్రీడాకారులు
పాలమూరు క్రికెట్‌లో యువతరం సత్తా చాటుతోంది. అబ్బాయిలతో పాటు
అమ్మాయిలు సైతం దూసుకుపోతున్నారు. బ్యాట్‌తో పరుగుల వరద పారించడంతో పాటు వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సహకారంతో ఎండీసీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్‌లో మెరుపులు మెరిపించి..భవిష్యత్‌కు భరోసా నింపుకొన్నారు. పురుషుల అండర్–23 టూ డే లీగ్, అండర్–19 లీగ్, మహిళా క్రికెట్ లీగ్‌తో పాటు పలు కీలక పోటీల్లో రాణిస్తున్నారు. బ్యాట్, బాల్‌లో మెరుపులు మెరిపిస్తున్న వర్ధమాన క్రీడాకారులపై ప్రత్యేక కథనం.
– మహబూబ్‌నగర్ క్రీడలు
బంతితో తిప్పేసిన ముఖితుద్దీన్

క్రికెట్‌లో మెరుపులు

క్రికెట్‌లో మెరుపులు