
నీటి కోసం ఎదురుచూస్తున్నాం
వానాకాలం సీజన్‌లో కోయిల్‌సాగర్ నీళ్లపై ఆధారపడి పది ఎకరాల్లో వరిసాగు చేస్తాను. ఇప్పటికే నారుమళ్లు పెరిగాయి. ప్రస్తుతం నాట్లు వేసే సమయం సమీపిస్తోంది. కోయిల్‌సాగర్ నుంచి విడుదలయ్యే నీటి కోసం ఎదురుచూస్తున్నాం. అధికారులు రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటిని ఆయకట్టుకు విడుదల చేయాలి.
– నరహరి, రైతు, రాకొండ
ఆయకట్టు పెంచాలి
కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతోనే జూరాల నీటిని ఎత్తిపోస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కొత్త ఆయకట్టు కింద ఒక ఎకరా కూడా వరి సాగు కాలేదు. ప్రభుత్వం మరోసారి పిల్ల కాల్వ కోసం భూ సేకరణ చేసి వాటికి నిధులు మంజూరు చేయాలి. డిస్ట్రిబ్యూటర్ కాల్వలు నిర్మిస్తేనే కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉంది.
– చంద్రారెడ్డి, రైతు, మరికల్
వారం రోజుల్లో నీటి విడుదల
ప్రస్తుతం కోయిల్‌సాగర్‌లో నీటిమట్టం 23 అడుగులకు చేరుకుంది. మరో 2 అడుగులకు చేరిన తర్వాత ఆయకట్టు రైతులకు నీటి విడుదల చేస్తాం. నిధులు లేకనే కొత్త ఆయకట్టు కింద పిల్ల కాల్వల పనులు జరగడం లేదు. ఈ విషయాన్ని ఉన్నత అధికారులతో పాటు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాం.
– ప్రతాప్‌సింగ్, ఈఈ, కోయిల్‌సాగర్
●

నీటి కోసం ఎదురుచూస్తున్నాం