
పాత ఆయకట్టుకు సాగునీరు..
వర్షాకాలం కావడంతో ఆయకట్టు కింద అధికంగా వరి సాగయ్యే అవకాశం ఉంది. పాత ఆయకట్టు కుడి కాల్వ పరిధిలో మరికల్, ధన్వాడ, చిన్నచింతకుంట మండలాల్లో 9 వేల ఎకరాలు, ఎడమ కాల్వ కింద దేవరకద్ర మండలం మాత్రమే ఉండటంతో అక్కడ 3 వేల ఎకరాలు కలిపి 12 వేల ఎకరాల ఆయకట్టుకు కోయిల్‌సాగర్ నీరు చేరుతుంది. వాస్తవానికి కొత్త ఆయకట్టు 38,250 ఎకరాలను కలుపుకొని 50,250 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో 2012 జూరాల నుంచి కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టును నింపుతున్నారు. కానీ ఇప్పటి వరకు మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించిన దాఖాలాలు లేవు.