
పోలీసు వాహనాల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
నారాయణపేట: పోలీసు వాహనాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని ఆర్‌ఐ స్టోర్, ఎంటీ సెక్షన్ ఆఫీస్, స్టోర్‌రూంలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసుల సంక్షేమం కోసం వచ్చే వస్తువులను అందరికీ లిస్ట్ ప్రకారం ఇవ్వాలన్నారు. స్టోర్ రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని సూచించారు. ఉపయోగంలో లేని వస్తువులు, ఫర్నిచర్‌ను వేలం వేయాలన్నారు. అనంతరం పోలీసు మోటారు ట్రాన్స్‌ఫోర్ట్ సెక్షన్‌లో ఎస్పీ తనిఖీలు చేపట్టారు. పోలీసు వాహనాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ప్రతి వాహనానికి సంబంధించిన స్పేర్ స్పాట్స్ జాగ్రత్తగా ఉంచి.. అవసరమైన వాహనాలకు అందించాలని తెలిపారు. మెకానిక్స్, డ్రైవర్స్, సిబ్బంది అందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని.. ప్రతి వస్తువు సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఎస్పీ వెంట ఆర్‌ఐ నర్సింహ, సీఐ శివశంకర్, స్టోర్ ఇన్‌చార్జి ఏఆర్ ఎస్‌ఐ శంకర్‌జీ, రైటర్ నరేశ్ తదితరులు ఉన్నారు.