నిర్మించినా.. నిరుపయోగం
కొత్తపల్లి: భూనీడ్ ఉన్నత పాఠశాలలో 375 మంది విద్యార్థులకుగాను రెండే మూత్రశాలలున్నాయి. దీంతో చాలామంది విద్యార్థులు ఒంటికి రెంటికి ఆరుబయటకు వెళ్తున్నారు. గతేడాది మన ఊరు– మన బడి కార్యక్రమం కింద మరుగుదొడ్లను, మూత్రశాలలను నిర్మించారు. కానీ బిల్లులు రాకపోవడంతో దాన్ని ప్రారంభించానికి కాంట్రాక్టర్ ఒప్పుకోవడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే, మండలంలోని వాల్యనాయక్ తండాలో ప్రస్తుతం 17 మంది విద్యార్థులున్నారు. వీరందరు భూనీడ్‌లోని పాఠశాలకు వెళ్తున్నారు. గతంలో ఈ తండాల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని పాఠశాలను తొలగించారు. అప్పటి నుంచి పాఠశాలను గ్రామ పంచాయతీగా భవనంగా మార్చి ఉపయోగిస్తున్నారు.


