నాగరికతకు వ్యవసాయమే మూలం
నారాయణపేట రూరల్: మానవ నాగరికత అభివృద్ధికి వ్యవసాయమే పునాదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేష్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ లష్మిపతి అన్నారు. మండలంలోని భైరంకొండలో న్యాయ విజ్ఞాన సదస్సుతో పాటు ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో భూమిని వ్యవసాయానికి ఉపయోగించాలని, వ్యాపార నిమిత్తం మార్చరాదన్నారు. వ్యవసాయం అంటే ఆహారం, పశుగ్రాసం, నార, ఇంధనం కోసం మొక్కలను, జంతువులను పెంచాలన్నారు. ఆధునిక కాలంలో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయని అన్నారు. ప్రభుత్వ పథకాలైన ఫసల్ బీమా యోజన, డ్రిప్ ఇరిగేషన్ వంటివి ఉపయోగించుకోవాలన్నారు. న్యాయ వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారం అందరికి సమాన హక్కులు కల్పించిందని అన్నారు. ప్రజలు వాటిపై అవగాహన కలిగి ఉన్నప్పుడే తమ హక్కులను నిర్భయంగా పొందుతారని తెలిపారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సంస్థ ద్యారా పేదవారు 15100 నెంబర్ కి కాల్ చేసి ఉచిత న్యాయాన్ని పొందవచ్చు అన్నారు. వరకట్న వేధింపులు, సఖి సెంటర్, వోల్డీగే హోమ్, గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ప్రయోజనాలపై అవగాహన కలిపించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగిరెడ్డి, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, పర లీగల్ వాలంటరీస్, ప్రజలు పాల్గొన్నారు.


