సజావుగా ఎన్నికల ప్రక్రియ
నారాయణపేట: జిల్లాలో మూడో విడత జరిగిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో సజావుగా పూర్తిచేశామని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. బుధవారం మక్తల్, కృష్ణా, మాగనూరు, నర్వ, ఊట్కూర్ మండలాల్లో నిర్వహించిన ఎన్నికల పోలింగ్ సరళితో పాటు కౌంటింగ్ ప్రక్రియను కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ శ్రీను, డిప్యూటీ కలెక్టర్లు శ్రీరామ్ ప్రణీత్, ఫణికుమార్, కలెక్టరేట్ ఏఓ శ్రీధర్, నోడల్ అధికారి సాయిబాబా, డీపీఆర్‌ఓ రషీద్ ఉన్నారు.
● జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలైన ఊట్కూర్, మల్లేపల్లి, చిన్నపొర్ల, కాచ్‌వార్, జక్లేర్, మంతన్‌గోడ్, కాట్రేవుపల్లి, భూత్పూర్ తదితర పోలింగ్ కేంద్రాలను ఎస్పీ డా.వినీత్ సందర్శించి.. పోలింగ్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి అ వాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి ఆయన సూచించారు.


