తాతదే జయకేతనం
మూసాపేట మండలం చక్రాపూర్ సర్పంచ్ ఎన్నికల్లో మనువడిపై తాత గెలుపొందాడు. ఈ గ్రామంలో 1285 ఓట్లకు 1175 పోలయ్యాయి. ఇందులో బీఆర్‌ఎస్ మద్దతుదారుడు గంటెల రఘురాములుకు 639 ఓట్లు, కాంగ్రెస్ మద్దతుదారుడు లక్ష్మినారాయణకు 484 ఓట్లు వచ్చాయి. దీంతో 155 ఓట్ల మెజార్టీతో మనువడిపై తాత నెగ్గాడు. రఘురాములుకు ముగ్గురు సంతానం ఉండటంతో గతంలో ఆయన పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఆయన తన తల్లిని పోటీ చేయించి రెండు సార్లు సర్పంచ్‌గా విజయం సాధించాడు. తాజాగా ప్రభుత్వం ముగ్గురు పిల్లలు ఉన్న వారికి అవకాశం ఇవ్వడంతో స్వయంగా రఘురాములు పోటీలో నిలిచి తొలిసారి విజయం సాధించాడు. – అడ్డాకుల


