పాఠశాలల సమయం మార్చండి
నారాయణపేట రూరల్: చలిగాలుల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో జిల్లాలోని పాఠశాలల సమయాన్ని మార్చాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌ను జిల్లా పీఆర్టీయూ నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం ఆయనకు వినతిపత్రం అందజేశారు. పాఠశాల సమయం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30గంటల వరకు మార్చాలని, టెన్త్ విద్యార్థుల ప్రత్యేక తరగతులు సైతం ఉదయం 8.30గంటలకు ప్రారంభించాలని కోరారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్నారు.
అధికారులకు సన్మానం
మూడు విడుదల పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసినందుకు అడిషనల్ కలెక్టర్ తో పాటు, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రెడ్డిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొని ఎక్కడ కూడా వాయిదా లేకుండా విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరించారని, ఎన్నిక రోజు తర్వాత ఓడీ సౌకర్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
టీ 20 జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
నారాయణపేట టౌన్: జిల్లాలోని స్థానిక మినీ స్టేడియంలో ఎండీసీఏ, విశాఖ ఇండస్ట్రీస్ సౌజన్యంతో, హెచ్‌సీఏ ఆధ్వర్యంలో జి. వెంకటస్వామి కాక మెమోరియల్ టీ–20 క్రికెట్ లీగ్‌కు నారాయణపేట క్రికెట్ జట్టును గురువారం ఎంపిక చేసినట్లు జిల్లా క్రికెట్ ఇన్‌చార్జి పి.డీ రమణ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్పీ మహమ్మద్ రియాజ్ ఉల్‌హక్ హాజరై మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎమ్‌డీసీఏ గ్రౌండ్‌లో ఈ నెల 22 నుండి జరిగే కాకా వెంకటస్వామి మెమోరియల్ టోర్నమెంట్‌లో చక్కటి ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ టోర్నమెంట్‌కు జిల్లా నుండి 15 మందిని ఎంపిక చేసినట్లు క్రికెట్ ఇన్‌చార్జి రమణ తెలిపారు. ఈ పోటీలలో మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లా జట్లు పాల్గొంటాయన్నారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ వెంకటేష్ శెట్టి, చిన్నారెడ్డి, లక్ష్మీనారాయణ, నారాయణపేట క్రికెట్ కోచ్ అజయ్, ప్రవీణ్, అశోక్ రెడ్డి, జనార్థన్, అక్తర్ ఫాషా, నాగేష్, రెహమన్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల సమయం మార్చండి


