గ్రామాల అభివృద్ధిలో సర్పంచులే కీలకం
మక్తల్: తాజా పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు బాధ్యతాయుతంగా పనిచేసి గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహ అన్నారు. గురువారం మక్తల్‌లో ఏర్పాటుచేసిన అభినందన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నూతన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లను మంత్రి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గంలో అత్యధికంగా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారని, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని అన్నారు. దేశంలో ప్రజల అభ్యున్నతి కోసం ఖర్చు పెట్టే డబ్బుకు సంతకం చేసేది ఒకరు గవర్నర్, మరొకరు సర్పంచ్ అని, అభివృద్ధిలో సర్పంచులు పాత్ర కీలకమన్నారు. గ్రామాల అభివృద్ధికి అన్ని విధాలుగా తన వంతు సహకారం అందిస్తానని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో బీకేఆర్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, మార్కెట్ చైర్‌పర్సన్ రాధమ్మ, మణెమ్మ గణేష్‌కుమార్, వెంకటేష్, విష్ణువర్ధన్‌రెడ్డి, సురేష్, శ్రీనివాస్‌రెడ్డి, షంషుద్దీన్, ఫయాజ్ పాల్గొన్నారు.


