ఎన్నికలు నిర్వహిస్తేనే..
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతోనే పల్లెల్లో సమస్యలు నెలకొన్నాయి. కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. నిధులు లేక తాగునీటితో పాటు పారిశుద్ధ్యం, తదితర సమస్యలు వేధిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహించి సమస్యలకు మార్గం చూపాలి.
– తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచ్, అప్పంపల్లి
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి..
వానాకాలంలో ప్రబలే వ్యాధులను దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టడం జరిగింది. పల్లెల్లో మురుగు నిలిచే ప్రాంతాలను గుర్తించాలని కార్యదర్శులకు అదేశాలు జారీ చేశాం. ఫాగింగ్ యంత్రాలు సిద్ధం చేశాం. బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ ద్రవణాలు కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నాం. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకుంటాం.
– సుధాకర్‌రెడ్డి, డీఎల్‌పీఓ
●


