
భారమైన నిర్వహణ..
జిల్లాలో 280 గ్రామపంచాయతీలు ఉండగా.. వర్షాకాలంలో అంతటా రోడ్లు ధ్వంసమవుతున్నాయి. మురుగు నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. ఈ నేపథ్యంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే దోమల వృద్ధిని అరికట్టేందుకు అవసరమైన బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ యంత్రాలను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని ఆదేశించిన ప్రభుత్వం.. నిధులు మాత్రం కేటాయించలేదు. దీంతో ఊరంతటికీ కలిపి ఒకసారి ఫాగింగ్ చేయాల్సి వస్తే దోమల నివారణ ద్రావణం, పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలుకు కనీసం రూ. 4వేలు ఖర్చవుతోంది. పంచాయతీ ఖాతాల్లో నిధులు లేని తరుణంలో ఫాగింగ్ ఎలా చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. గతంలో కొనుగోలుచేసిన వీధి దీపాలు, బ్లీచింగ్ పౌడర్, తాగునీటి పరికరాలకు సంబంధించి బకాయిలు ఉండటంతో దుకాణదారులు తిరిగి అప్పు ఇచ్చేందుకు వెనకాడుతున్నారని తెలుస్తోంది.