
రిపేర్లతో లీకేజీలు..
ప్రాజెక్టు మొత్తం 62 గేట్లలో 18 గేట్ల నుంచి ఏడాదిగా నీరు లీకేజీ అవుతోంది. ప్రధానంగా గేట్లు దెబ్బతినకుండా, రాపిడికి గురికాకుండా రక్షణ కల్పించే రబ్బర్ సీల్ పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే గేట్లను పైకి, కిందికి ఆపరేట్ చేసేందుకు సహాయపడుతున్న ఇనుప రోప్‌లు పూర్తిగా దెబ్బతిని 8 గేట్లను ఆపరేటింగ్ చేయలేకపోతున్నారు. ఈ సమస్యను గుర్తించిన అధికారులు మొత్తం 62 గేట్లు మొదలుకొని రబ్బర్ సీల్స్, రోప్స్, పెయింటింగ్, సాండ్ బ్లాస్టింగ్, గేట్ల స్ట్రెంథనింగ్ వంటివి మరమ్మతు చేసేందుకు మూడేళ్ల క్రితం గత ప్రభుత్వం రూ.11 కోట్లు మంజూరు చేసింది. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మాత్రం ఒప్పందం గడువు ముగిసి.. మరోసారి పొడిగించిన గడువు ముగిసిపోయినా పట్టుమని 50 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారు.
● ప్రస్తుతం డ్యాం పైభాగాన ఉన్న హయిస్ట్ బ్రిడ్జి, గేట్ల వద్ద ఉన్న వాక్‌వే బ్రిడ్జికి సంబంధించి సాండ్ బ్లాస్టింగ్ పనులు పూర్తి చేయగా.. మిగిలిన పనులు కొనసాగుతున్నాయి.