డబ్బులు లేక ప్రారంభించలే..
నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అధికారులు మార్కింగ్ కూడా ఇచ్చారు. కూలి పని, ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్‌లో ఇల్లు గడుస్తుంది. బేస్‌మెంట్ వరకు నిర్మించడానికి డబ్బులు లేవు. మహిళా సంఘంలో రూ.లక్ష రుణం ఇస్తే పనులు ప్రారంభిస్తా.
– జమునాబాయి, ఒంటరి మహిళ,
దేన్యానాయక్‌తండా, మద్దూరు
పరిశీలిస్తున్నాం..
ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు తక్షణ రుణసాయం రూ.లక్ష ఏ విధంగా మంజూరు చేయాలనే విషయంపై విధివిధానాలు పరిశీలిస్తున్నాం. స్పష్టత వచ్చిన వెంటనే లబ్ధిదారులు మహిళా సంఘాల సభ్యులైతే రుణ సాయం అందజేస్తాం.
– మొగులప్ప, డీఆర్డీఓ, నారాయణపేట
●
డబ్బులు లేక ప్రారంభించలే..


