హౌస్‌కీపింగ్ నుంచి ఒకరిని, శానిటేషన్ నుంచి ఒకరిని ఇద్దరు సూపర్‌వైజర్లను ప్రొటోకాల్ కింద ఏర్పాటు చేసుకుని తనకు తెలిసిన వారు వస్తే వారిని దర్శనాలకు పంపిస్తూ ఏజెన్సీ ప్రతినిధులు దర్శనాల దందా నడుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దర్శనం టికెట్లు కూడా ఎన్ని అడిగితే అన్ని ఆ విభాగపు అధికారులు వీరికి రెడ్ కార్పెట్ వేసి ఇస్తున్నట్లు సమాచారం. కొన్ని సార్లు టికెట్లు లేకుండానే దర్శనం చేయించి వారి వద్ద నుంచి టికెట్టు డబ్బులు వసూలు చేస్తూ ప్రోటోకాల్‌కు వెళ్లే సూపర్‌వైజర్, ఏజెన్సీ ప్రతినిధులు..వచ్చిన డబ్బుల్లో వాటా పంచుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పద్మావతి ఏజెన్సీపై ఇన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. దేవస్థాన ఉన్నతాధికారులు, చైర్మన్, జిల్లా కలెక్టర్ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


