డోన్: కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రజాప్రయోజన పనుల నిర్వహణను గాలికొదిలేయడం దారుణమని ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఉదయం తన స్వగృహం నుంచి వాకింగ్ చేస్తూ స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌ను సందర్శించారు. రెండేళ్ల క్రితం రూ.3.50 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఈ భవనం ఆవరణ కళాహీనంగా తయారై కుక్కలు, పందులకు ఆవాసంగా మారడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ ప్రహరీ చుట్టూ ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ నిర్వహణ లోపంతో పిచ్చి మొక్కలు పెరగడంతో అసహనం వ్యక్తం చేశారు. జాతి సంపద అయిన వసతిగృహం నిర్వహణకు కనీసం వాచ్‌మెన్‌ను కూడా నియమించుకోలేని దుస్థితిలో టీడీపీ ప్రభుత్వం ఉందన్నారు. వాకర్ల కోసం ఏర్పాటు చేసిన మూత్రశాలలు, మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరడం శోచనీయమన్నారు. పట్టణంలో రూ. లక్షల ప్రజాధనంతో తమ హయాంలో నిర్మించిన ఏడు పార్కులు నేడు ఆలనాపాలనా లేక బోసిపోయాయన్నారు. పార్కుల్లో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లల కోసం దుకాణాలను ఏర్పాటు చేస్తే వాటిని నేటి వరకు తెరిపించకపోవడం దారుణమన్నారు. స్విమ్మింగ్ పూల్, పార్కులు మూత పడటానికి కారణం టీడీపీ నాయకులేనన్నారు. అనవసరమైన స్థల వివాదాన్ని సృష్టించి ప్రజాధనాన్ని వృథా చేశారని బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పార్కు, స్విమ్మింగ్ పూల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
ఎంపీపీ భవనం పరిశీలన..
రూ.3.50 కోట్లతో పట్టణ నడిబొడ్డున నిర్మించిన ఎంపీపీ నూతన భవనాన్ని ఆదివారం మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సంద ర్భంగా నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు శ్రమించిన ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి సోదరులతో పాటు వైస్ ఎంపీపీ ఎర్రిస్వామిని అభినందించారు. యూరోపియన్ మోడల్‌లో నిర్మించిన ఈ భవనం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మాజీ మంత్రి వెంట పార్టీ మండల అధ్యక్షులు సోమేష్ యాదవ్, క్లస్టర్ యూనివర్సిటీ మాజీ సభ్యులు నాగభూషణం రెడ్డి, పార్టీ నాయకులు మల్యాల శ్రీనివాసరెడ్డి, తాడూరు జయచంద్ర, విశ్వనాథ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, చంద్రశేఖర్, క్వాలిటీ అబ్దుల్లా, ఆర్ట్ రమణ, వంశీ, డీలర్ కృష్ణ, మేడా రఘు, ఉమామహేశ్వరరావ్, ధనుంజయరెడ్డి, రాజా మహేష్, సుభాన్, పాలుట్ల రఘురాం, ఫారెస్ట్ మౌళాలి, మహేశ్వరరెడ్డి, గడ్డం సురేష్, సుంకన్న తదితరులు ఉన్నారు.
పార్కులు, స్విమ్మింగ్ పూల్‌ను
ఎందుకు పట్టించుకోవడం లేదు
పాలకులు, అధికారుల
నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి


