వైఎస్సార్‌సీపీ పాలన ప్రజలకు స్వర్ణయుగం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ పాలన ప్రజలకు స్వర్ణయుగం

Mar 27 2026 9:27 AM | Updated on Mar 27 2026 9:27 AM

వైఎస్సార్‌సీపీ పాలన ప్రజలకు స్వర్ణయుగం

బొమ్మలసత్రం: గత వైఎస్సార్‌సీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు స్వర్ణయుగాన్ని చూశారని వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్‌ మైనారిటీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు బొల్లవరపు జాన్‌ వెస్లీ అన్నారు. గురువారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో క్రిస్టియన్‌ మైనారిటీ సెల్‌ జిల్లా అధ్యక్షులు కారు రవికుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, జాన్‌వెస్లీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో క్రిస్టియన్‌లకు పూర్తిగా న్యాయం జరిగిందన్నారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం డాక్టర్‌ బీఅర్‌ అంబే డ్కర్‌ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారని విమర్శించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు పాలకుల చేతిలో కీలు బొమ్మ ల్లా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు కోర్టులను సైతం తప్పుదోవ పట్టిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలను జైళ్లకు పంపుతున్నారన్నారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో కోవిడ్‌ సంభవించినా సంక్షేమ పథకాలు ఆపలేదని గుర్తు చేశారు. ఇంత ఆదాయ వనరులు ఉన్నా టీడీపీ ప్రభుత్వం అప్పుల దిబ్బలా రాష్ట్రాన్ని ఆధోగతి పాలు చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ పాలనలో క్రిస్టియన్‌లకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సముచిత స్థానం కల్పించారన్నారు. టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించకుండా మోసం చేయటం దుర్మార్గమన్నారు. బనగానపల్లి నియోజకవర్గంలో మైనింగ్‌ మాఫియా చెలరేగిపోతుందన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఇంటికి పంపి తిరిగి సంక్షేమ ప్రభుత్వాన్ని గెలిపించుకునేందు కు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నార. సమావేశంలో రాష్ట్ర క్రిస్టియన్‌ మైనా రిటీ సెల్‌ సెక్రటరీ విల్సన్‌పాల్‌, నంద్యాల నియోజకవర్గ అధ్యక్షులు మనో జ్‌ కుమార్‌, పట్టణాధ్యక్షులు ఇమ్మానియేలు, రవిప్రకాష్‌, కరుణాకర్‌, ప్రేమ్‌కుమార్‌, కిరణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement