నిప్పుల కొలిమి | - | Sakshi
Sakshi News home page

నిప్పుల కొలిమి

Mar 27 2026 9:27 AM | Updated on Mar 27 2026 9:27 AM

పలు మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రానున్న నాలుగైదు రోజుల్లో జిల్లా నిప్పుల కుంపటిగా మారే ప్రమా దం ఏర్పడింది. గురువారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వడగాల్పులు, ఎండల తీవ్రత పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు కర్నూలు లో నమోదవుతుండటం గమనార్హం. ఇదిలాఉంటే కర్నూలు నగరం సహా ఎక్కడా చలివేంద్రం కనిపించని పరిస్థితి నెలకొంది. ఇటీవల జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి లైన్‌ డిపార్టుమెంట్లతో వేసవి ఉపశమన చర్యలపై సమావేశం నిర్వహించి సంబందిత శాఖలకు ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ కొందరు అధికారులు పట్టించుకోని పరిస్థితి కనిపిస్తోంది.

అహోబిలం ప్రధాన పరిపాలనాధికారిగా పార్థసారథి

ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం దేవస్థానం ప్రధాన పరిపాలనాధికారిగా పార్థసారథి గురువారం బాధ్యతలు స్వీకరించారు. పీఠాధిపతి శ్రీ రంగరాజ యతీంద్ర మహాదేశికన్‌ ఆదేశానుసారం చైన్నె నుంచి అహోబిలం చేరుకున్న ఆయన గురువారం దేవస్థానం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అహోబిలం దేవస్థానం అభివృద్ధితో పాటు భక్తులకు వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అర్చకులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ క్షేత్ర అభివృద్ధికి పాటుపడాలన్నారు. గత రెండు సంవత్సరాల్లో ఇప్పటి వరకు సుమారు 12 మంది పరిపాలనాధికారులు మారడంతో పాటు బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకు మించి ఒక్కరు కూడా విధులు నిర్వహించలేక బాధ్యతల నుంచి తప్పుకుని వెళ్లిపోయారు. మొన్నటి దాక బాధ్యతలు నిర్వహించిన మరో వర్గం తమను కాదని చైన్నె నుంచి వచ్చిన ఇతను ఎన్ని రోజులు ఇక్కడ విధులు నిర్వహిస్తారో.. చూస్తాం అంటూ.. తేల్చిచెబుతున్నారు. స్థానిక నేతల ఒత్తిళ్లు, మఠం అసమ్మతి నేతల ఎత్తులను తట్టుకుని పార్థసారథి ఎన్నాళ్లు ఉంటారోననే చర్చ కొనసాగుతోంది.

మండలం ఉష్ణోగ్రత

జూపాడుబంగ్లా 40.64

రుద్రవరం 40.68

కొత్తపల్లి 40.44

కోడుమూరు 40.4

పెద్దకడుబూరు 40.4

కల్లూరు 40.29

శిరువెళ్ల 40.18

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement