ప్రభుత్వ మెడికల్ కాలేజీతో మాల కల సాకారమవుతోంది
నేను కర్నూలులోని ఓ ప్రైవేటు కంపెనీలో చిరుద్యోగిగా పని చేస్తున్నా. నా భార్య సమీనా సుల్తానాకు డాక్టర్ కావాలన్నది కల. పెళ్లయిన తర్వాత చదువుకునేందుకు ఆమెను ప్రోత్సహించా. రాత్రింబవళ్లు కష్టపడి చదివి నీట్‌కు ప్రిపేరైంది. ఈ ఏడాది నీట్ పరీక్ష రాయగా లక్ష ర్యాంకు రావడంతో సీటు వస్తుందో రాదోనని భయపడ్డాం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మెడికల్ కళాశాలల నిర్మాణం జరగడంతో సీట్లు పెరిగాయి. తెలిసిన వారి ద్వారా ఆరా తీస్తే నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వస్తుందని చెప్పారు. దీంతో కౌన్సెలింగ్‌లో ఆప్షన్ ఇచ్చాం. అదృష్టవశాత్తు ఇక్కడే సీటు వచ్చింది. ఏ కేటగిరీలో సీటు రావడంతో ప్రభుత్వ ఫీజు రూ.15 వేలు చెల్లించాం. నా భార్య ఇక్కడే ఉంటూ చదువుకుంటోంది. చిన్న ఉద్యోగం చేసుకునే మా లాంటి వారికి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వరంగా మారాయి. ప్రభుత్వ కాలేజీలు లేకుంటే ప్రైవేటు మెడికల్ కళాశాలలో ఏ కేటగిరీ సీటు రూ.2 లక్షలు అంట. దేవుడి దయ వల్ల సీటు రావడంతో మా
ఇంట్లోనూ ఒకరు డాక్టర్ కాబోతున్నారు.
– అబ్దుల్ నజీజ్, కర్నూలు


