నవరత్నాలు మెరిశాయి
మహిళలను మహారాణులుగా చూడాలని ఆకాంక్షించిన జగనన్న పలు సంక్షేమ పథకాల అమలు చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన నవరత్నాలు ప్రతి ఇంటా మెరుస్తున్నాయి. ఇందుకు పగిడ్యాల మండలం నెహ్రూనగర్ సయ్యద్ షబానా కుటుంబం నిదర్శనం. ఆమెది చాలా నిరుపేద కుటుంబం. భర్త సయ్యద్ బాషా గౌండా పని చేస్తాడు. వీరికి ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తుండగా 2019లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అమలు చేసిన వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాలు ఎంతో భరోసానిచ్చాయి. మొదటి సారి రూ. 1 లక్ష రుణంతో 10 గొర్రె పిల్లలు కొనుగోలు చేసి పెంపకం చేపట్టారు. ఇప్పటి వరకు 70 గొర్రెలు అయ్యాయి. వాటిలో కొన్ని విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. సీ్త్రనిధి పథకం కింద రూ. 2 లక్షలు రుణం తీసుకొని ఇంటి వద్దనే కిరాణం అంగడి పెట్టారు. గొర్రెల పెంపకం, కిరాణం అంగడి ఆదాయం మొత్తం నెలకు సుమారు రూ.50 వేల వరకు వస్తుంది. అలాగే ఇంట్లోనే చీరల వ్యాపారం పెట్టారు. ఆమె భర్త గౌండ పని మానేసి కిరాణం అంగడి, చీరల వ్యాపారం, గొర్రెలను చూసుకుంటున్నారు. కుమారుడు సయ్యద్ సోహెల్ డిగ్రీ చదువుతున్నాడు. కుమార్తెకు వివాహం చేశారు. ‘జగన్ సారు పుణ్యమా అంటూ మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా జీవనం సాగిస్తున్నాం. వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి. వైఎస్ జగనన్న వెయ్యేళ్లు వర్ధిల్లాలి’.. అంటూ సయ్యద్ షబానా చెబుతున్నారు. – నందికొట్కూరు
నవరత్నాలు మెరిశాయి


