పకడ్బందీగా వంద రోజుల ప్రణాళిక అమలు
శిరివెళ్ల: పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు వంద రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. శనివారం స్థానిక మోడల్ స్కూల్‌ను ఆయన తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థుల తో మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పరీక్షలో వంద శాతం ఉత్తీర్ణత సాఽధించాలన్నారు. ప్రతి రోజు స్టడీ అవర్, స్లిప్ టెస్ట్ జరగాలన్నారు. వచ్చిన మార్కులను ఆన్‌లైన్ చేయాలని టీచర్లును ఆదేశించారు. గత ఏడాది పరీక్షలో తమ పాఠశాల 96 శాతం ఉత్తీర్ణత సాఽధించి మార్కులలో మండల టాపర్‌గా నిలి చిందిని ప్రిన్సిపాల్ ఇష్రత్‌బేగం డీఈఓతో చెప్పారు. ప్రస్తుతం పాఠశాలలో 97 మంది విద్యార్థుల్లో ఏ గ్రేడ్‌లో 17 మంది, బీ 45, సీలో 35 మంది ఉన్నారని వివరించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డీఈఓ ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ డీఈఓ శంకరప్రసాదు ఉన్నారు.


