ఊరు మారింది..
గ్రామ పరిపాలనను మరింత బలోపేతం చేసేలా ప్రతి 5వేల జనాభా అవసరాలకు అనుగుణంగా జిల్లాలో 516 గ్రామ, వార్డు సచివాలయాలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందుబాటులోకి తెచ్చారు. రెవెన్యూ పరమైన అన్ని సమస్యలను సత్వరమే పరిష్కరించేలా ఉద్యోగులను నియమించారు. అలాగే రైతుల కోసం రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటుచేసి భూసార పరీక్ష మొదలు, విత్తన ఎంపిక, పంట సంరక్షణ, ఎరువులు, క్రిమి సంహారక మందులు సబ్సిడీపై పంపిణీ చేశారు. విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటుతో పాటు ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశ పెట్టి ఆరోగ్య ప్రదాతగా నిలిచారు. ఐదేళ్లలో పల్లెలు మారిపోయాయి. ప్రభుత్వ భవనాల ఏర్పాటు, స్థానికంగానే సేవలతో ప్రజలు ఎంతో ఆనందించారు. అభివృద్ధిని చూసి మురిసిపోయారు. అయితే టీడీపీ ప్రభుత్వంలో సచివాలయాలు, ఆర్‌బీకేలను నిర్వీర్యం చేసి మీ సేవా కేంద్రాలకు సేవలను ధారాదత్తం చేయడం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవలందడం లేదు. – డోన్
గ్రామీణ ప్రాంతాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల ద్వారా సత్వర సేవలు అందించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదే. అధికారంలో ఉన్ననాళ్లు పేదల కోసమే పరితపించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్ని సేవలు ఒకేచోట లభించడం గొప్ప విషయం. ఇలాంటి అద్భుతమైన ఆలోచనలకు నాంది పలికిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. – చిరంజీవి, రైతు,
దొరపల్లె గ్రామం, డోన్ మండలం
ఊరు మారింది..


